calender_icon.png 13 July, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమావేశం

12-07-2025 08:39:20 PM

పటాన్ చెరు: పటాన్ చెరు యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని శనివారం అమీన్ పూర్  మున్సిపల్ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాసుల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుర్రం రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాలలో పార్టీని పూర్తి బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు జరిగిన అభివృద్ధిని ఇంటింటికి తెలియజేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులు, సభ్యులకు తెలిపారు. అనంతరం జిల్లా యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ నాగార్జున, అధ్యక్షుడు నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, బలవంత రెడ్డి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన అంశాల గురించి మాట్లాడారు.