calender_icon.png 25 October, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజానికి విద్యార్థులు దిక్సూచి

25-10-2025 12:00:00 AM

వ్యవసాయ పరిశోధనలు మరింత అభివృద్ధి జరగాలి 

కావేరి యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గజ్వేల్ అక్టోబర్ 24 : సమాజ మార్పుకు విద్యార్థులు దిక్సూచిగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నా రు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని కావేరి యూనివర్సిటీ మరియు కావేరి సీడ్స్ కంపెనీని సందర్శించి, ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఆయ న ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కె హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ లు పుష్పగుచ్చం అందించి గవర్నర్ కు స్వాగ తం పలికారు.

కాగా కావేరి వ్యవసాయ యూనివర్సిటీ, విత్తన పరిశోధన కేంద్రం  తమ తమ రంగాలలో సాధించిన అసాధారణ పురోగతి, విజయాలు,  పరిశోధన మరి యు అభివృద్ధి (Rఅండ్‌డీ) కార్యక్రమాలను యూనివర్సిటీ చాన్సలర్  జీ.వి. భాస్కరరావు,  వైస్ ఛాన్స్లర్ డాక్టర్ వి.ప్రవీణ్ రావు లు గవర్నర్కు వివరించారు.  ఈ సందర్భం గా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు స మాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని, విజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ ఉత్పత్తిని, సాంకేతికతను, పరిశోధనలను అభి వృద్ధి చేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభు త్వం విద్యారంగంలో తీసుకుంటున్న కార్యక్రమాల గురించి గవర్నర్  తెలిపారు. కార్యక్ర మంలో మొదట కావేరి యూనివర్సిటీని సం దర్శించి యూనివర్సిటీ ప్రొఫైల్ ను పరిశీలించారు. తదుపరి ఎంటమాలజీ, పాథాలజీ, సాయిల్ సైన్స్, బ్రీడింగ్, ఫిజియోలజీ ల్యా బ్స్‌ను మరియు విద్యార్థులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో వివిధ రకాలైన  డ్రోన్ టెక్నాలజీ ,రోబో టెక్నాలజీ, 3ౄ ప్రింటింగ్ ఏ.ఆర్ & వి.ఆర్ మోడల్స్, మరియు అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తర్వాత గవర్నర్  వర్మి కంపోస్ట్ కార్యక్రమాలను పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ రీసెర్చ్ సెంటర్లో టిష్యూ కల్చర్, జినోమిక్స్, స్పీడ్ బ్రీడింగ్, ప్లాంట్ హెల్త్ ల్యాబ్స్, జీన్ బ్యాంక్ లను సందర్శించి ఇవి చాలా అదునాతనంగా ఉన్నాయని అభినందించారు. కా వేరి యూనివర్సిటీ చాన్సలర్ జీవీ భాస్కరరావు  మాట్లాడుతూ గవర్నర్  సందర్శన విశ్వవిద్యాలయానికి ఒక గౌరవంగా భావిస్తున్నామన్నారు.

విద్యార్థుల మొత్తం అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం తీసుకుంటున్న ప్రతిపాదనలు మరియు పథకాలను వివరించారు.  వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ కావే రి వర్సిటీ పరిశోధనలో కొత్త దారిని చూపించడానికి కట్టుబడి ఉం దని, కావేరి సీడ్స్ కంపెనీతో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయ రంగా నికి ఒక మనోబలం కలిగిస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీవో  వి.చంద్రకళ, వర్గల్ తాసిల్దార్  రఘువీరా రెడ్డి, ఏసిపి నరసింహులు, సిఐ మహేందర్ రెడ్డి, కావేరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ బి. శ్రీనివాసులు, స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్ష పొలసాని, అగ్రికల్చరల్ డీన్ ఏ .ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.