calender_icon.png 10 October, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గం ఎన్నిక

10-10-2025 12:31:46 AM

కామారెడ్డి, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గమును గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన శివకుమార్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన అధ్యక్షులుగా సాయి కృష్ణ, కార్యదర్శిగా నవిత, కోశాధికారిగా బి. నరేందర్ మరియు కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

ఈ కార్యక్రమంలో ఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు ఎన్ వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎం నాగరాజు, జిల్లా సహాధ్యక్షులు ఎం చక్రధర్. కోశాధికారి ఎం దేవరాజు, టిఎన్జీవోస్ కేంద్ర సంఘం ఈసీ మెంబర్ కాసం శివకుమార్ కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.