calender_icon.png 6 May, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి

06-05-2025 12:11:44 AM

- ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేరవేయాలి

నాగర్ కర్నూల్ మే 5 (విజయక్రాంతి): వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పని చేయాలని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే లక్ష్యంగా పని చేయాలన్నారు. గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతమే లక్ష్యంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వారితోపాటు గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, జిహెచ్‌ఎంసి ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.