06-05-2025 12:12:38 AM
25 బైకులు సీజ్... పలువురి ట్రాన్స్ జెండర్లపై కేసు
ఎల్బీనగర్, మే 5 : పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం, ఆదివారం రాత్రి వేళల్లో సీఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో సరూర్‌నగర్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అర్దరాత్రి సమయంలో రోడ్డుపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ, అతివేగంగా బైక్ లు నడుపుతున్న ఆకతాయిలను పట్టుకొని 25 బైక్‌లను సీజ్‌చేసి, వారికి కౌన్సి లింగ్ ఇచ్చారు.
దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేష న్ వద్ద పాదాచారులకి ఇబ్బంది కలిగిస్తున్న కొంతమంది ట్రాన్స్ జెండర్లని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి, వారిని బైన్ డోవర్ చేసి, సరూర్ నగర్ తహసీల్దార్ ఎదుట హాజరుపర్చారు. రాత్రి పూట బహిరంగ ప్రదేశాల్లో కూర్చొని మద్యం సేవిస్తు న్నవారితోపాటు అర్దరాత్రి బహిరంగ ప్రదేశాల్లో బర్త్ డే పార్టీ లు చేసుకున్న సుమారు 35 మంది వ్యక్తులపై ౠసింగ్ కేసులు నమోదు చేశారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ట్రిపుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, బర్త్ డే పార్టీ లు చేసుకోవడం, రాత్రిళ్ళు ట్రాన్స్ జెండర్లు రోడ్డుపై వచ్చిపోయేవారిని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డి హెచ్చరించారు.