calender_icon.png 14 September, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేసే కుట్ర

14-09-2025 01:45:47 AM

  1. పెండింగ్ ఉపకార వేతన బకాయిలు విడుదల చేయాలి
  2. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్‌ను ఎత్తివేసే కుట్ర పన్నుతోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు,  ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతన బకా యిలు విడుదల చేయాలని ఆయన డిమాం డ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆం దోళనలు, బంధులు తప్పవని హెచ్చరించా రు.

ఈ మేరకు శనివారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో స్కాలర్షిప్‌ల బకాయిలు చెల్లించాలని హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉపకార వేతనాల విడుదలకు  నిర్లక్ష్యం వహిస్తుండడంతో లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి చెప్పినా అధికారులు పట్టించుకోకుండా  ఫీజు బకాయిల విడుదలలో జాప్యం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి శాఖకే ఈ విధంగా నిధుల విడుదల లో జాప్యం వహిస్తే, వేరే శాఖ పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి లు, ఉపకార వేతనాలను చెల్లించాలన్నారు. అనంతరం ఎంపీ ఆర్ కృష్ణయ్య జన్మదినం సందర్భంగా విద్యానగర్‌లోని బీసీ భవన్ లో పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.  కార్యక్రమం లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ము దిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, డాక్టర్ అరుణ్ కుమార్, రాజ్ కుమా ర్, నాయకులు అనంతయ్య, జిల్ల పెళ్లి అంజి, పగిళ్ల సతీష్ కుమార్, సి. రాజేందర్, సుధాకర్, రామ్ కోటి, రాందేవ్ మోడీ, చిక్కుడు బాలయ్య, నిఖిల్ పటేల్  పాల్గొన్నారు.