calender_icon.png 18 December, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడప గడపకి రాజ్యాంగం

18-12-2025 12:00:00 AM

ఘట్‌కేసర్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : సామాన్య ప్రజలకు చట్ట అవగాహన, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి అంశా లపై చైతన్యం కల్పించడానికి స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయ మని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యు కేషన్ జాయింట్ డైరెక్టర్ ఎన్. కృష్ణ వేణి అన్నారు. గడప గడపకి భారత రాజ్యాంగం కార్యక్రమంలో భాగంగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య, ఉపాధ్య క్షుడు మేకల పద్మారావు లు బుధవారం ఘట్‌కేసర్‌లోని వారి నివాసంలో రాజ్యాం గం పుస్తకం అందజేశారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ప్రతి పౌరుడు సోదరభావం, సౌభ్రాతృత్వం పెంపొందించుకునే విధంగా రాజ్యాంగం పట్ల అవగాహన ఎంతో అవసరమని అన్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ నుండి రాజ్యాంగం పుస్తకం అందుకున్న వారు మరో ఇద్దరికి అందించలని ఇలా ప్రతి ఇంటిలో రాజ్యాంగం ఉండే విధంగా చేస్తున్న ప్రయత్నం హర్ష నీయమని, ఆర్గనైజేషన్ సభ్యులను అభినందించారు.