calender_icon.png 18 November, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగవంతంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

18-11-2025 12:00:00 AM

దేవునిపల్లిలో కమిషనర్ మార్కింగ్

ఎల్లారెడ్డి, నవంబర్:(విజయ, క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణం నాలుగో వార్డ్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరో దశకు చేరుకుంది. లబ్ధిదారులు ఎదురుచూస్తున్న గృహ నిర్మాణ పనులకు సోమవారం మున్సిపల్ కమిషనర్ మహేష్ ప్రత్యక్షంగా చేరుకుని మార్కింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు బెస్త పోచవ్వ గృహ స్థలాన్ని పరిశీలించి, నూతన గృహ నిర్మాణం త్వరితగతిన ప్రారంభం కావాలని సూచించారు.

ఇందిరమ్మ పథకం ద్వారా కల నెరవేరబోతున్నందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ ఇందిరమ్మ పథకం అమలులో చూపుతున్న చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ రాజిరెడ్డి, బిల్ కలెక్టర్ రుడావత్ నరేష్, జిపిఓ హనుమాన్లు, ఏఎంసీ డైరెక్టర్ నాగం శంకరయ్య, నీల రవి తో పాటు గ్రామ పెద్దలు, యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.