calender_icon.png 18 November, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనల మేరకు అత్యధిక పరిహారం అందిస్తాం

18-11-2025 12:00:00 AM

 సీతారామ ఎత్తిపోతల పథకం భూ సేకరణ పరిహార నిర్దారణకు రైతులతో చర్చించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

ఖమ్మం, నవంబరు 17 (విజయక్రాంతి): సీతారామ ఎత్తిపోతల పథకం సంబంధించి భూ సేకరణకు నిబంధనల మేరకు అత్యధిక పరిహారం అందిస్తామని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు.సింగరేణి మండలం బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి గ్రా మాలలో సీతారామ ఎత్తిపోతల పథకం ని మిత్తం భూ సేకరణ పరిహారం రేటు నిర్దారణ కు సంబంధిత రైతులతో స్థానిక కలెక్టరే ట్ లో ఆయన చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి మండలం బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి గ్రా మాలలో సీతా రామ ఎత్తిపోతల పథకం 13 వ ప్యాకేజీ నిర్మాణంలో భాగంగా భూ సేకరణ చేయాల్సి ఉండగా, భూ సర్వే నిర్వహిం చి అవార్డులు ప్రకటించామని, ప్రజల నుం చి అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరించామని అన్నారు. బాజుమల్లాయిగూడెం గ్రా మంలో ఎకరానికి 2 లక్షల 70 వేల రూపాయలు ఉందని, భూ సేకరణ చట్టం ప్రకారం రెండింతలు అనగా 5 లక్షల 40 వేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం పెంచి 10 లక్షల 80 వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించిందని అన్నారు.

ఆర్బిట్రేషన్ లో 12 శాతం వడ్డీ క్రింద 64 వేల రూపాయ లు కలిపి మొత్తం 11 లక్షల 44 వేలు ఎకరాకు చెల్లించనున్నట్లు తెలిపారు. రేలకాయ పల్లి గ్రామంలో ఎకరానికి 2 లక్షల 92 వేల రూపాయలు ఉందని, భూ సేకరణ చట్టం ప్రకారం రెండింతలు అనగా 5 లక్షల 85 వేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్ర భుత్వం పెంచి 11 లక్షల 70 వేల రూపాయ లు చెల్లించాలని నిర్ణయించిందని అన్నారు. ఆర్బిట్రేషన్ లో 12 శాతం వడ్డి క్రింద 70 వేల 390 వేల రూపాయలు కలిపి మొత్తం 12 లక్షల 40 వేల 390 రూపాయలు ఎకరాకు చెల్లించనున్నట్లు తెలిపారు.

2022 నుం చి భూముల ధరల సవరణ జరగలేదని, భూముల ధరల సవరణ జరిగినా కూడా 10 నుంచి 15 శాతం కంటే ఎక్కువ పెరగద ని, రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరి స్తూ జిల్లా కలెక్టర్ ప్రతి సంవత్సరం 11 శాతం చొప్పున పెంచి ఎకరం విలువ 3 లక్షల 59 వేల అవుతుందని, వీటికీ 4 రెట్లు పెంచి 14 లక్షల 37 వేలు, అదనపు విలువ పెంచితే 14 లక్షల 50 వేల వరకు మాత్రం పరిహారం ఇ చ్చేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చివరికి బాజుమల్లాయిగూడెం గ్రామ రైతులకు ఎకరానికి 15 లక్షలు, రేలకాయపల్లి గ్రామ రైతులకు ఎకరానికి 16 లక్షల రూపాయలు భూమికి పరిహారం అందుతుందని అన్నారు.

భూమి లో ఉన్న వ్యవసాయ పంపు సెట్ల, చెట్లు, ఇ తర నిర్మాణాలకు విడిగా పరిహారం అందిస్తామని అన్నారు. ముసాయిదా నోటిఫికేష న్ జారీ చేసిన తేది ముందు నుంచి 3 సంవత్సరాల వరకు లావాదేవీలు పరిశీలించి స రాసరి ధర నిర్ణయించడం జరిగిందని అన్నా రు. రైతులను అన వసరంగా మభ్యపెట్టి మోసం చేయాలనే ఉద్దేశం జిల్లా యంత్రాంగానికి లేదని, రైతుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, చర్చించి సాధ్యమైనంత మేరకు నిబంధనల మేరకు అత్యధిక పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. 

సమావేశంలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ ఎకరానికి రూ. 35 నుంచి రూ. 40 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని, భూములను కోల్పోవ డం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని అన్నారు. భూమిలో ఉన్న పైప్ లైన్, చెట్లు, ఇతర పరికరాలు, డ్రిప్ సిస్టం వివరాలు సరిగ్గా నమోదు చేసి పరిహారం అందించాలని అన్నారు.ఈ సమావేశంలో ఎస్డీసి ఎం. రాజేశ్వరి, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.