21-08-2025 06:14:08 PM
కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల (విజయక్రాంతి): బాలసదనం భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) ఆదేశించారు. గురువారం నస్పూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న బాల సదనం భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 1.34 కోట్ల రూపాయల మిషన్ వాత్సల్య అంచనా నిధులతో బాల సదనం భవనం నిర్మాణ పనులు చేపడుతున్నామని, సంబంధిత అధికారులు నిర్మాణ పనులపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపి పనులను త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖ అధికారులు తదితరులున్నారు.