08-01-2026 12:00:00 AM
మళ్లీ మొదటి నుంచి భూముల లెక్క చేయాల్సిందే..!
నారాయణపురం భూముల రీ సర్వేకు గెజిట్ విడుదల
ఇప్పుడైనా సమస్యకు పరిష్కారం లభించేనా..?
కేసముద్రం, జనవరి 7 (విజయక్రాంతి): ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఇ బ్బందులకు గురి చేస్తున్నారని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు గత కొన్నేళ్లుగా చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామ భూములను రీ సర్వే చేయడానికి గెజిట్ విడుదల చేసింది. దీనితో ఆ గ్రామ భూముల లెక్క మళ్లీ మొదటికొచ్చింది. 2017 వరకు నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం రెవెన్యూ గ్రామ శివారు గ్రామంగా నారాయణపురం ఉండేది. ఆ గ్రామాన్ని నెల్లికుదురు మండలం నుండి విభజించి 2018లో కేసముద్రం మండలంలో విలీనం చేశారు.
ఈ క్రమంలో అప్ప టి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ధరణి పోర్ట ల్ ప్రవేశపెట్టడంతో కేసముద్రం మండలం లో విలీనమైన నారాయణపురం గ్రామ భూ ముల్లో కొన్ని సర్వే నంబర్లను అటవీ భూ మిగా పేర్కొనడంతో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టా పాస్ పుస్తకాలు కొత్తగా పొందడానికి ఆటంకంగా మారింది. 43 సర్వే నంబర్లతో చిన్న ముప్పారం గ్రామ రెవెన్యూ పరిధి నుండి నూతనంగా నారాయణపురం రెవెన్యూ గ్రామంగా పేర్కొని కేసముద్రం మండలంలో కలపగా అందు లో, 22 సర్వే నంబర్లలో ఉన్న భూమి పూర్తి గా అటవీగా పేర్కొనడంతో చాలామంది గిరిజన, గిరిజనేతర రైతులకు చెందిన సాగు భూములకు పట్టా పాస్ పుస్తకాలు దక్కకుండా పోయాయని అప్పటినుండి ఇప్ప టివరకు అనేక పర్యాయాలు వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో కొద్దికాలం క్రితం అప్పటి ప్రభు త్వం ఎంజాయ్ మెంట్ సర్వేకు ఆదేశించి కొంతమందికి పట్టా పాస్ పుస్తకాలు కూడా ఇటీవల ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా వెయ్యి ఎకరాల్లో భూమికి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందంటూ రైతులు మళ్లీ నిరసన బాట పట్టారు. తహసిల్దార్ కార్యాలయం మొదలు కొని కలెక్టరేట్, రాష్ట్ర సచి వాలయం, ల్యాండ్ సర్వే కార్యాలయం ఎదు ట కూడా ధర్నాలు నిర్వహించారు. ఈ క్రమంలో నారాయణపురం భూముల వ్యవహారం ఏడతెగని సమస్యగా మారి అధి కారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎం జాయ్మెంట్ సర్వే ఓ విధంగా, చిన్న ము ప్పారం నుండి కేసముద్రం మండలానికి బదిలీ అయిన సమయంలో ఓ విధంగా, అసలు మోకా మీద మరో విధంగా భూమి రికార్డులు ఉండడంతో నారాయణపురం భూమి సమస్య పరిష్కారం చిక్కుముడిగా మారింది.
కొందరికి పట్టా పాస్ పుస్తకాలు వచ్చి, మరికొందరికి రాకపోవడం, చిన్న ముప్పారం పరిధిలో ఉన్నప్పుడు పాతకాలం నాటి పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారికి కూడా కొత్తగా ధరణిలో పట్టా పాస్ పుస్తకాలు రాకపోవడం, తాజాగా ధరణి ద్వారా కొందరికి పట్టా పాస్ పుస్తకాలు భూమి లేకుండా ఇచ్చారని ఫిర్యాదులు రావడం, దీనికి తోడు రైతులు తరచుగా ఆందోళనకు దిగడం, రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడ్డప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదనే విమర్శలు వెల్లువెత్తడంతో చివరకు ప్రభుత్వం అసలు నారాయణపురం భూముల చిక్కు సమస్య ఏమిటో తేల్చేందుకు రీ సర్వేకు ఆదేశించినట్లు అధికార వ ర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా 2018లో చిన్న ముప్పారం గ్రామం నుంచి వేరుపడి కేసముద్రం మండలంలో విలీనం కావడం తో పాటు రెవెన్యూ గ్రామంగా ఏర్పడడానికి కేటాయించిన 43 సర్వే నంబర్లలో ఉన్న భూమి ఆధారంగా అన్ని రకాల భూములకు నూతనంగా రీ సర్వే చేసి గ్రామ నక్ష తయారు చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో భూ ములకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించి, ఆబాది, కుంటలు, చెరువులు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పనికిరాని భూమి, ఫారెస్ట్, గవర్నమెంట్, పట్టా భూమి నిర్ధారించేందుకు సమగ్రంగా రీ సర్వే చేపట్టనున్నట్లు సర్వే డిపార్ట్మెంట్ అధికారులు ప్రకటన చేశారు. ఈ మేరకు గ్రామంలో ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పంచాయతీలో అతికించారు. సర్వే చేసే సమయంలో హద్దు లు గుర్తించడానికి భూ యజమానులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని, అవసరమైన రికార్డులు, ఇతర ఆధారాలు అందించాల్సి ఉం టుందని రి సర్వే గెజిట్ ప్రకటనలో పేర్కొన్నారు.
తమ భూములకు సంబంధించిన పత్రాలను, ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు అందించాలని సూచిం చారు. అయితే ఇప్పటికే చాలా కాలంగా పలుసార్లు సర్వే నిర్వహించడం, కొందరికి పట్టా పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం, తీరా ఇప్పుడు మళ్లీ రీ సర్వేకు గెజిట్ జారీ చేయడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. అయితే తాజాగా ప్రభుత్వం నారాయణపురం గ్రామ సమస్యను శాశ్వతంగా తొలగించి రైతులకు న్యాయం చేసే విధంగా రీ సర్వే చేయడం జరుగుతుందని, కొత్తగా భూభారతి ద్వారా రీ సర్వే ఆధారంగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఈసారి తాజాగా నిర్వహించే రీసర్వేతో నైనా నారాయణపురం గ్రామ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు దక్కుతాయని ఆశాభావంతో మరికొంతమంది రైతులు ఉన్నారు.