06-11-2025 01:42:31 AM
-అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం
-రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి పనులపై ఎమ్మెల్యే, అధికారులతో కలెక్టర్ సమీక్ష
ఆదిలాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజార్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి రైల్వే, రహదారులు, భవనాలు, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమా వేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... జిల్లా కేంద్రంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద తరచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆర్‌యూబీ, ఆర్వోబీ ప్రాజెక్టులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సుమారు రూ.94 కోట్ల వ్యయంతో ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు.
భూసేకరణ, సాంకేతిక అనుమతు లు తుది దశలో ఉన్నాయని వెల్లడించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించి 2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, రైల్వే అధికారులు మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యు త్ శాఖలతో సమన్వయం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే పాయల్ శంక ర్ మాట్లాడుతూ... సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జి నిర్మాణాలు ఇప్పుడు సాకార మవుతున్నాయని తెలిపారు.
డిసెంబర్లో పనులు ప్రారంభమవుతాయని, అవసరమైన భూసేకరణకు కూడా కేంద్రం నుంచే నిధులు అందనున్నాయని వివరించారు. రైతులు, విద్యార్థులు, రోగులు, సాధారణ ప్రజలు ఎదు ర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే పట్టణం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నా రు.
దేశంలో మొదటిసారిగా పూర్తిగా కేంద్ర బడ్జెట్‌తో ఈ తరహా ప్రాజెక్టు నిర్మించబడటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సమావేశం లో రైల్వే సీనియర్ ఇంజనీర్ సాంబశివరావు, ఆర్ అండ్ బి అధికారులు, మున్సిపల్ కమిష నర్ రాజు తదితరులు పాల్గొన్నారు.