06-11-2025 01:41:48 AM
ఆదిలాబాద్/కుమ్రం భీం ఆసిఫాబాద్/బెల్లంపల్లి/దండేపల్లి/నిర్మల్, నవంబర్ 5 (విజ యక్రాంతి): కార్తీక మాసంలో అంటేనే చాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని, నెల రోజుల పాటు ఆలయాల్లో కార్తీక దీపోత్సవ శోభ కనబడుతోంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణ మి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవా రం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో కార్తీక దీపోత్సవం, కాగడ హారతి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం లో, జైనథ్ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున నిర్వ హించిన కాగడ హారతి వేడుకల్లో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో జరిగిన కాగడ హారతిలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి ఎమ్మెల్యే దంపతులచే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కలిసి కాగడ హారతిని వెలిగించిన ఎమ్మెల్యే దంపతులు దీపోత్సవం లో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడు తూ కార్తీక మాసం అంటేనే దీపోత్సవాలు, కాగడ హారతిలకు ప్రత్యేకగా నిలుస్తుందన్నా రు.
ఆధ్యాత్మికత వల్లనే మనిషికి ప్రశాంతత నెలకొంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావనతో మెలగాలని సూచించారు. కార్తీ క మాసంలో కోటి దీపోత్సవాలు, కాగడ హారతులతో ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ సంత రించుకుంటున్నాయని తెలిపారు.
కార్తీకం శుభప్రదం
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శివాలయాలతో పాటు అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఉద యం నుండే ఆలయాల వద్ద భక్తులు వత్తుల తో దీపాలు వెలగించి నివేదించారు.ఇంటి ప్రాంగణాలలో తులసి మొక్కకు ప్రత్యేక పూజ లు నిర్వహించి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.పలువురు అత్యంత వైభవంగా తులసి కళ్యాణం చేపట్టారు.
జిల్లా కేం ద్రంలోని సందీప్ నగర్ శివాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా సిఐ బాలాజీ వరప్రసాద్ పాల్గొన్నారు.జంకాపూర్, కోదండ రామాలయంలో సహస్ర దీపోత్సవ కార్యక్రమం చేపట్టారు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.కాగజ్ నగర్ మండలంలోని ఇస్గాం శివ మల్లన్న ఆలయంలో సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం చేపట్టడం తో పాటు ఆలయం ఎదుట జ్వాలతోరణం ప్రారంభించారు.
సిర్పూర్ టి మండలంలోని టోంకిని సిద్ది హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు.రెబ్బెన మండలం నంబాల శివాలయం, వాంకిడి మండల కేంద్రంలోని శివకే శవ ఆలయాలకు భక్తులు చేరుకొని మొక్కలు చెల్లించుకున్నారు.కార్తీక మాసం సందర్భంగా నది స్నానాలు ఆచరించి నదిహారతి హారతి ఇవ్వడంతో పాటు ఇసుకతో లింగాలను ఏర్పాటు చేసి దీపాలను వెలిగించి శివయ్యకు భక్తులు మొక్కుకున్నారు.
పట్టణంలోని శివకేశవ మందిర్, కేశవ నాథ ఆలయం వద్ద నెల రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కిస్లాపూర్ హను మాన్ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీపావళి పురస్కరించుకొని చేపట్టాల్సిన కేదారేశ్వర నోములు సమయం అనుకూలించక చేసుకుని వారు పౌర్ణమి రోజు నోములను భక్తిశ్రద్ధలతో నోమకున్నారు.
బుగ్గలో కన్నుల పండువగా..
బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవా రం కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం 5 గంటల నుంచి భక్తులు బుగ్గ శివాలయానికి పోటెత్తారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో బుగ్గ ప్రాంతం సందడిగా మారింది. మహిళలు పెద్ద ఎత్తున కోనేటి స్నానాలు ఆచరించారు. దేవస్థానం ఎదురుగా గల శివలింగం, నందీశ్వర విగ్రహాల వద్ద మహిళలు భారీగా కార్తీక ఉసిరిక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వరునికి పలు రకాల నైవేద్యా లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
శివ సత్తెల పూనకాలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు. భక్తాంజనేయ, నాగులమ్మ దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్, అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాము లు దంపతులు కార్తీక పౌర్ణమి ఏర్పాట్లను పర్యవేక్షించారు. బెల్లంపల్లి ఎసిపి ఏ. రవికుమార్ నేతృత్వంలో బందోబస్తు చేపట్టారు.
కిటకిటలాడిన గూడెం ఆలయం
దండేపల్లి మండలంలోని శ్రీ రమాసహి త సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు సమీప గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి సత్యదేవుడితో పాటు భక్తాంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, సాయిబా బా ఆలయాలను భక్తులు దర్శించి మొక్కు లు చెల్లించారు.
పెద్ద సంఖ్యలో మహారాష్ట్ర, సమీప జిల్లాల నుంచి భక్తులు సత్యదేవుడి సన్నిధిలో సత్యనారాయణ వ్రతాలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో కార్తీక ఉసిరిక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట సీఐ, దండేపల్లి, లక్షెట్టిపేట ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు.
వైభవంగా గోదావరి హారతి
నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి బాస ర అమ్మవారి ఆలయంలో బుధవారం రాత్రి గోదావరి హారతి ఘనంగా నిర్వ హించారు. కార్తీక పౌర్ణమి పురస్కరిం చుకుని గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆధ్వర్యం లో హారతి ఇచ్చారు కార్తిక దీపాలను వెలిగించారు గోదావరి నదిలో సరస్వ తి మాత బోటును నడిపించి రంగు రంగుల విద్యుత్ దీపాలతో నిర్వ హించారు ఈ వేడుకల్లో కలెక్టర్ అభి లాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల దేవాదాయ ఈవో అంజలీదేవి అధికా రులు సిబ్బంది పాల్గొన్నారు.