calender_icon.png 15 July, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజేంద్రనగర్‌లో డస్ట్‌బిన్ల ఏర్పాటు

15-07-2025 12:59:33 AM

రామ్‌కీ సంస్థ ఆధ్వర్యంలో..

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రామ్‌కీ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా డస్ట్‌బిన్లను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలోని పారిశుద్ధ్య సమస్యలను తగ్గించేందుకు, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు డస్ట్‌బిన్ల ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుంది” అని ‘ పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో డివిజన్ మొత్తానికి అవసరమైన పారిశుద్ధ్య సదుపాయాలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శానిటేషన్ సూపర్‌వైజర్ ప్రవీణ్‌కుమార్, రాంకీ సంస్థ సూపర్‌వైజర్ నర్సింహారెడ్డి, జవాన్ బాబయ్యా, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శానిటేషన్ శాఖ అధికారులు మాట్లాడుతూ.. ప్రజలు కూడా ఈ కొత్త డస్ట్‌బిన్లను సద్వినియోగం చేసుకోవాలని, స్వచ్ఛతను పాటించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.