13-09-2025 12:54:37 AM
నారాయణపేట.సెప్టెంబర్ 12(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా(కొడంగల్ ని యోజకవర్గం) లోని కోస్గి సామాజిక ఆరోగ్య కేంద్రం రాష్ట్రంలోని మిగతా ఆరోగ్య కేంద్రాలకు (మోడల్) ఆదర్శంగా నిలవాలని స్టేట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు అన్నారు. ఇటీవల కాలంలో కోస్గి సీ హెచ్ సీ కి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రజారో గ్యం కాపాడటంలో వైద్యులు చిత్త శుద్ధితో వై ద్య సేవలు అందించాలని ఆమె సూచించారు. శుక్రవారం నారాయణ పేట జిల్లాలో ని కోస్గి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి ఆమె సం దర్శించారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలోని గైనిక్, పీడియాట్రిక్, మెయిల్, ఫిమేల్ సర్జికల్ వార్డు, ట్రై ఏజ్, ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించారు. చిన్న పిల్లల వార్డులోకి వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న పలువురు చి న్నారులను చూసి ఆప్యాయంగా పలకరించా రు. ఆ చిన్నారుల తల్లులతో మాట్లాడి పిల్లలకు వచ్చిన డెంగ్యూ జ్వరం ఎన్ని రోజుల క్రి తం నుంచి ఉందని, ఆస్పత్రిలో ఎన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్నారని అడిగి తెలుసుకున్నారు. జ్వరం తగ్గేవరకు చాలా జాగ్ర త్తగా పిల్లలను చూసుకోవాలని తెలిపారు.
కోస్గి సీ హెచ్ సీ పరిధిలో గ్రామాల వారీగా ఎన్ని డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయ నే వివరాల జాబితా ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్ ను ఆదేశించారు. వాటితో పాటు రోజు వారి ఓపీ, ఐ పి వివరాల గురించి అ డిగి తెలుసుకున్నారు.వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం ఆ స్పత్రిలో జిల్లా కలెక్టర్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులు, కోస్గి ఆస్పత్రి వైద్య నిపుణులతో ఆమె రెండు గంటల పాటు స మీక్ష జరిపారు.
ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుందని తెలిపారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తెలపాలన్నారు. సీ హెచ్ సీ పరిధిలో ఎన్ని పీహెచ్సీ కవర్ అవుతున్నాయని అడిగారు. ఎన్ హెచ్ ఎం ఎన్ సి డి లు లేవని ఎన్ సి డి ట్రైనింగ్ కోస్గిలోనే జరగాలని ఆదేశించారు. అలాగే బ్లడ్ స్టోరేజ్ యూనిట్ కోస్గిలో ఏర్పాటు చేయాలన్నారు. స్క్రీనింగ్ క్యాంప్ ఈ నెల 17 నుండి ప్రారంభించాలని బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ గురించి తెలుసుకున్నారు. ఎంతమంది మెడికల్ ఆఫీసర్లు ఉన్నారని, ట్రైనింగ్ అయిన నర్సింగ్ వాళ్లు ల్యాబ్ లో ఎన్ని టెస్టులు చేస్తున్నారననే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈసీజీ మిషన్ ఉందని,అలాగే డెంటల్ సర్వీస్, ఎక్స్ రే, డెర్మటాలాజీ, ఎల్.ఎఫ్.టి, ఈఎన్టీ సర్వీస్ ఆప్తాలమాజీ సేవలు అందించేందుకు సమీపంలోని ఆసుపత్రుల నుంచి వారానికి ఒక రోజు ఆయా విభాగాల వైద్య నిపుణులను ర ప్పించి సేవలు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫార్మసీలో కూడా సిస్టం ఎంట్రీ కావాలన్నారు. జనరిక్ స్టోర్ ఉందా లేదా అని అడిగారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఎం ప్యానల్ కచ్చితంగా చేయాలన్నారు.
కోస్గి సీ హెచ్ సీ కి ఇంకా ఏమైనా రిక్వైర్ మెంట్స్ ఉంటే చెప్పాలని, సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని ఆమె సూచించారు. ఈ సమీక్ష లో వైద్య వి ధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయే కుమార్, టి జి ఎం ఎస్ ఐ డి సి మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర రెడ్డి, ఈడీ కౌటిల్య, సిఐఓ మంజునాథ్ నాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ మసూద్ ఖాన్, ఐ టీ ఈ అండ్ సీ అధికారి యశ్వంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్ట ర్ మల్లికార్జున్, వైద్యులు అనిరుద్ తదితరులుపాల్గొన్నారు.