06-05-2025 01:26:07 AM
చివ్వేంల మే 5: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం అక్కలదేవి గూడెం గ్రామ ఊరు శివారులో 365బి బి ఖమ్మం బైపాస్ రోడ్డు ప్రక్కన్న ఆదివారం రాత్రి రసాయన వ్యర్ధాలను పోస్తున్న రెండు కంటైనర్లను (%ఊఐ 34ఊ 2024, జుఆ 39ఇఔ% 6567) గ్రామస్తులు పట్టుకొని చివ్వేంల పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది. కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
జాతీయ రహదారి 365 బి బి రోడ్ల వెంట ఉన్న గ్రామ ప్రజలు దుర్గంధంతో బాధపడుతున్నారు. రసాయన కంపెనీకి చెందిన వారు పక్క ప్రణాళికతో అర్ధరాత్రి సమయంలో కలుషితమైన వ్యర్ధ రసయనాలు రోడ్డు వెంట పోస్తున్నడంతో భూగర్భ జలాలు కలుషితమవు తున్నాయి. శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులతో ఇ బ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రోడ్డు వెంట వెళ్లే వాహనదారులకు విపరీతమైన దుర్వాసన రావడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారు.
ఈ వ్యర్ధ రాయనాల వాసనతో ఆరోగ్యాలు చెడిపోవడమే కాకుం డా ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టుబడిన ఈ కంటైనర్లను తప్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికైనా పొల్యూషన్ బోర్డ్ అధికారులు, పర్యావరణ శాఖ అధికారులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి వ్యర్ధాలను గ్రామ సమీపం లో పోస్తున్న వాహనాలను సీజ్ చేసి వాటిని సప్లు చేస్తున్న కంపెనీలను మూసివేసి అందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి పైన కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు..
పర్యావరణాన్ని కాపాడాలి చివ్వేంల నేత కొంగల సతీష్
పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులపైన, వారికి సహకరిస్తున్న అధికారుల పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ బోర్డ్ అధికారులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి రాజకీయ నాయకుల ఒత్తిడికి తల్లోగ్గకుండా వ్యర్ధాలను సప్లు చేస్తున్న కంపెనీ యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకొని పర్యావరణాన్ని రక్షించాలి. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలి. భూగర్భ జలా లు కలుషితం కాకుండా చూడాలి.