calender_icon.png 6 May, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన కోసం 30 ఏళ్ల పోరాటం

06-05-2025 01:25:23 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): కుల గణన చేపట్టడం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయమని, ఇది ముమ్మాటికీ ప్రధాని మోదీ ఘనత అని బీజేపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీ సమాజం తరఫున మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. గత ముప్పు ఏండ్లుగా కుల గణనపై పోరాటాలు చేస్తూ వస్తున్నామని,  వందల సార్లు ఢిల్లీలో ధర్నాలు చేసినట్టు గుర్తుచేశారు.

60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ కుల గణన చేసేందుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. కుల గణనతో బీసీల శకం మొదలయ్యిందన్నారు. మోదీ నిర్ణయం వల్ల బీసీలకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని, ప్రధాని మోదీ వెంట బీసీ సమాజం నిలబడాలన్నారు. గత ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేశాయని...

బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చట్ట బద్దత కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వేలో స్పష్టత లేదని... ముస్లింలను బీసీలో చేర్చడం కాంగ్రెస్ చేసిన మొదటి తప్పు అని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. బీసీలకు 42 శాతం అంటున్న కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎంత మంది బీసీలు ఉన్నారో చెప్పాలన్నారు.