calender_icon.png 16 August, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి

16-08-2025 12:43:30 AM

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

సూర్యాపేట, ఆగస్టు 15 (విజయక్రాంతి) : జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పి కే నరసింహతో కలిసి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

నంతరం ఆయన మాట్లాడుతూ గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వాతంత్య్రం సాధించిన తదుపరి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శతృవులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికామని, మనం సాధించుకున్న స్వాతంత్య్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నామన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. తదుపరి జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రగతినీ చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు, జడ్పీ సి ఈ ఒ వి.వి అప్పారావు, ఆర్డీఓ వేణు మాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి,జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దేశ భవిష్యత్తు బాలలపైనే ఉంది...ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,ఆగస్టు 15 (విజయ క్రాంతి): దేశ భవిష్యత్తు బాలలపైనే ఆధారపడి ఉందని బాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం 79 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మునుగోడు లోని అధికారిక క్యాంపు కార్యాలయంలో  జాతీయ జెండాను ఎగరేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించి మాట్లాడారు.

ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన కోసం మనం ఎంత ఆలోచిస్తామో దేశం కోసం కూడా ఆలోచించి దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలిని అన్నారు . ప్రతి ఒక్కరూ కర్తవ్యం గా మనకోసం మన దేశం కోసం పని చేసినట్లయితే రాబోయే రోజుల్లో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుంది.

దేశ స్వాతంత్రం కోసం లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. స్వాతంత్ర ఫలాలను భావిభారత పౌరులకు అందించాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరి పైన ఉంది అన్నారు.ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు  మునుగోడు నియోజకవర్గం నలుమూలల నుండి  హాజరైన కార్యకర్తలు ,నాయకులు ఉన్నారు.

కర్మాగారాల శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట ఎగురని జాతీయ జెండా...

నల్లగొండ టౌన్, అగస్ట్ 15 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కర్మాగారాల శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట అధికారులు శుక్రవారం జాతీయ జెండాను ఎగరవేయకుండా నిర్లక్ష్యం చూపారు. దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశ నలుమూలల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఎదుట జాతీయ జెండాను ఎగురవేసి జాతీయతా భావాన్ని ఎలుగెత్తి చాటుతారు.

దేశంలోని ఏ కార్యాలయం ఎదుట నైనా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగురవేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇంతటి పవిత్రమైన రోజైన ఆగస్టు 15న కర్మాగారాల శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఎగరవేయకుండా కార్యాలయం అధికారులు, సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.

మరీ దారుణమేంటంటే శుక్రవారం సెలవు దినంగా పరిగణించారో ఏమో కానీ పరిశ్రమల శాఖ సర్కిల్ కార్యాలయం తలుపులను కూడా తెరవకపోవడం గమనార్హం. జాతీయ పతాకం ఎగరవేయడంలో నిర్లక్ష్యం వహించిన కార్యాలయ సిబ్బందిపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినపడుతోంది.

గుండాలలో..

గుండాల, ఆగస్టు 15((విజయ క్రాంతి) 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గుండాల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ హరికృష్ణ, మండల పరిషత్ కార్యాల యంలో ఎంపీడీవో దేవేందర్ రావు, పోలీస్ స్టేషన్లో ఎస్త్స్ర  తేజం రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య  కేంద్రంలో డాక్టర్ హైమావతి, స్థానిక ప్రెస్ క్లబ్ లో అధ్యక్షుడు సిలిపురం దశరథ,

మోడల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ జి రాము, కస్తూర్బా స్కూల్లో ఎస్‌ఓ విజయ్ లక్ష్మి, గుండాల హైస్కూల్లో చంద్రకళ, విద్యుత్  ఆఫీసులో అంబాల నరసింహ, ప్రాథమిక వ్యవసాయ  ఆఫీసులో చైర్మన్ లింగాల బిక్షం, వెటర్నరీ ఆఫీస్ లో పశు వైద్య అధికారి డాక్టర్ యాకూబ్, వివిధ గ్రామాలలో ఆయా గ్రామ కార్యదర్శులు, రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, యువజన సంఘాల నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.  

నల్లగొండలో..

నల్లగొండ టౌన్, ఆగస్టు 15: 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం నల్లగొండ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. వివిధ కార్యాలయాల్లో ఆయా అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాటి, కోర్టులో జిల్లా జడ్జి నాగరాజు, జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాటి,

జిల్లా పోలీస్ కార్యాలయంలో  ఎస్పీ శరత్చంద్ర పవార్, రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో అశోక్ రెడ్డి, డివిజన్ పోలీస్ కార్యాలయంలో  డీఎస్పీ శివరాం రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో  అదనపు కలెక్టర్  నారాయణ అమిత్, బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి,

బిఆర్‌ఎస్ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షులు రవీందర్ కుమార్ నాయక్, సిపిఐ కార్యాలయంలో  ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే నివాసంలో కంచర్ల భూపాల్ రెడ్డి, డిసిసిబి  కార్యాలయంలో చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఎం వి ఎన్  విజ్ఞాన కేంద్రంలో  అక్కనపెల్లి మీనయ్య, జాతీయ జెండాలని ఎగరేసి స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నారు.

నకిరేకల్‌లో..

నకిరేకల్ ఆగస్టు 15(విజయ క్రాంతి): నకిరేకల్ పట్టణంలో 79.వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఉద్దీపన పాఠశాల, మున్సిపల్ , తహసిల్దార్, మండల పరిషత్ కార్యాలయం , ఐసిడిఎస్, అగ్నిమాపక, వ్యవసాయ కార్యాలయం, పోలీస్ స్టేషన్,అన్ని ప్రభుత్వ కార్యాలయంలో విద్యాసంస్థలో, కార్పెంటర్ యూని యన్, స్వర్ణకారుల సంఘం, ఎలక్ట్రికల్, లారీ అసోసియేషన్, వివిధ యూనియన్ ఆఫీసుల వద్ద జాతీయజెండానుఆవిష్కరించారు.

అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకోని వారికి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేములవీరేశంమాట్లాడుతూ. ఎంతోమంది అమరవీరల త్యాగపలేమే నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుజరుపుకుంటున్నామన్నారు.వారుచేసినత్యాగంచిరస్మరణీయమన్నారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో సమాజాభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన కోరారు. 

మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత - శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంక టేశ్వర్లు, తహసిల్దార్ పి యాదగిరి ఎంపీడీవో వై వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ రంజిత్ , ఐసిడిఎస్ సిడిపిఓ ఆస్రాఅంజుమ్, పట్టణ సీఐ వెంకటేశ్వర్ గౌడ్ , అగ్రికల్చర్ ఏవో జానిమియా అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

కట్టంగూర్‌లో.

కట్టంగూర్ మండల కేంద్రంలో   తహసిల్దార్, మండల పరిషత్, పోలీస్ స్టేషన్ వివిధ గ్రామాల్లోని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థల్లో, 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ పి యాదగిరి ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు, ఎస్త్స్ర రవీం దర్, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.

ప్రాణాలకు ప్రతిఫలం పంద్రాగస్టు,,

యాదగిరిగుట్ట ఆగస్టు 15 విజయక్రాంతి : ఎందరో మహానుభావులు ప్రాణాలకు ప్రతిఫలం పంద్రాగస్టు, ఎందరో వారి ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రం కొరకు తెల్లదొరలతో యుద్ధం చేసి మనం స్వేచ్ఛగా బతకడానికి నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం మనకు ఇచ్చారు.

నేడు జరుపుకుంటున్న 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ గౌరాయిపల్లి లో చిన్నారుల ప్రసంగం ఆకట్టుకుంది. వివిధ రకాల వేషాలతో గ్రామంలోని కూడళ్ల వద్ద ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణలో చిన్నారుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్....

కోదాడ ఆగస్టు 15:స్వాతంత్ర దినోత్సవం రోజు అధికారుల తీరు పై మున్సిపల్ కమిషనర్ రమాదేవి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతం త్ర  దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా వతి రెడ్డి మొదటగా మహిళా మండలి వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి అనంతరం వ్యవసాయ మార్కెట్ వద్దకు వెళ్లగా అక్కడ చైర్మన్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో గాంధీ పార్కు, గ్రంథాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి త్వరగా మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకున్నారు.

మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జాతీయ గీతం ఆలపించిన అనంతరం స్వీట్స్ చాక్లెట్స్ లేవా అని అడగడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అప్పటికే స్వీట్స్ చాక్లెట్స్ మున్సిపల్ కార్యాలయంలో లేకపోవడంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అక్కడనుండి వెళ్లిపోయారు. అనంతరం కమిషనర్ రమాదేవి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.