22-09-2025 04:43:39 PM
- గురుకుల పాఠశాలలో మెస్ క్యాటరింగ్ బిల్లులు సకాలంలో అందక కాంట్రాక్టర్స్ ఆవేదన
- క్యాటరింగ్ అసోసియేషన్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు నాగరాజుగౌడ్
మునుగోడు,(విజయక్రాంతి): అప్పులు చేసి గురుకుల పాఠశాలలలో మెస్ క్యాటరింగ్ సేవలను ప్రభుత్వానికి అనుగుణంగా అందిస్తున్న ఆరు నెలలు నుండి బిల్లులు చెల్లించకపోవడంతో మాకు ఆత్మహత్యే శరణ్యం అయిందని క్యాటరింగ్ అసోసియేషన్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు నాగరాజుగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఆరు నెలలుగా క్యాటరింగ్ బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కఠినమైన సమయపాలన, ఆర్థిక పరిమితుల కింద నాణ్యమైన సేవలను అందించడంలో క్యాటరర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రభుత్వం గుర్తించాలన్నారు.
గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు క్యాటరర్లు సేవలను ఉదయం 3 గంటలకు పని ప్రారంభించి ఉదయం 7 గంటలకే విద్యార్థులకు టిఫిన్ అందించడానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు డైట్ ఛార్జీలను 40% పెంచినప్పటికీ, క్యాటరర్లు వారి ఛార్జీలలో తదనుగుణంగా పెరుగుదలను చూడలేదు అని అన్నారు.2025-2026 విద్యా సంవత్సరానికి ప్రతి విద్యార్థికి కనీస ఛార్జీలు రూ. 12 పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల బిల్లులను వెంటనే చెల్లించాలనీ,, దసరా సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా క్యాటరింగ్ సేవలను నిషేధిస్తామని హెచ్చరించారు.