calender_icon.png 22 September, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో కుండపోత వర్షం..

22-09-2025 04:41:27 PM

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rain) పడుతుంది. సోమవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, హయత్ నగర్ లో వర్షం దంచికొడుతుంది. హైదర్ నగర్, అల్విన్ కాలనీ, కేపీహెచ్ బీ, మూసాపేట్, నిజాంపేట్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, రాయదుర్గం, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, బోరబండ, సనత్ నగర్, యూసఫ్ గూడ, ఏరియాల్లో వర్షం కురుస్తుంది. 

ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతుందని వాతవారణ శాఖ(India Meteorological Department) ప్రకటించింది. దీంతో 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్,  భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.