calender_icon.png 7 January, 2026 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపు

06-01-2026 10:47:16 AM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు(Telangana Assembly Session) ఐదో రోజు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్-2047 పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులను ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టనుంది. జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ.... ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈవీ వాహనాల(EV vehicles) బ్యాటరీల సామర్థ్యం, ఈవీ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంపునకు కంపెనీలతో చర్చలు చేపట్టామని వెల్లడించారు.

ఈవీ వాహనాల రాయితీ అమలుతో రూ. 900 కోట్ల పన్ను నష్టం జరిగినట్లు పొన్నం తెలిపారు. ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం వరకు తగ్గించాలని కంపెనీలను కోరామని మంత్రి పొన్నం తెలిపారు. సభలోని సభ్యులను కూడా ఈవీ వాహనాలు కోలుగోలు చేయాలని మంత్రి కోరారు. ఎంఎన్ సీ కంపెనీలు ఈవీ వాహనాలు కొనుగోలు చేసేలా విధానం తెచ్చామన్నారు. పీఎం ఈ డ్రైవ్ కింద 575 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని మంత్రి వివరించారు. కొత్తగా 200కు పైగా ఈవీ బస్సులు వస్తున్నాయని తెలిపారు. వరంగల్ లో 100, నిజామాబాద్ లో 50 బస్సులు వస్తున్నాయని సూచించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలని మంత్రి ఆదేశించారు. స్క్రాప్ పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జీవో తీసుకువచ్చామని మంత్రి స్పష్టం చేశారు.