07-01-2026 09:04:52 PM
అసంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు
కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని సమ్మక్క బ్యారేజీ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించమని ఎస్సై ఇనిగాల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా కన్నాయిగూడెం మండల ఎస్సై వెంకటేష్ మాట్లాడుతూ... కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా చూస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. కన్నాయిగూడెం మండలంలో ఎలాంటి ఆసంఘట ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు భాగంగా పోలీసులు తనిఖీలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.