13-10-2025 12:25:40 AM
-వ్యాయామలోపం, అధిక బరువు, ఒత్తిడి కారణాలే వేగంగా కేసులు పెరుగుదల
-భారత్‌లో 18 కోట్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు
-ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా.మహ్మద్ ఇర్ఫాన్
హైదరాబాద్, అక్టోబర్ 12(విజయక్రాంతి): మోకాళ్లు, భుజాలు, మణికట్టులు వంటి కీళ్ల నొప్పులు వృద్ధాప్యానికి మాత్రమే పరిమితం కావు. ఆధునిక జీవనశైలిలో వ్యాయామం లోపం, అధిక బరువు, ఒత్తిడి కారణంగా యువతలో కూడా ఆర్థరైటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారత్‌లోనే సుమారు 18 కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా.ఆర్థరైటిస్ అనేది కీళ్లలో వాపు, నొప్పి, గట్టిపడ డం కలిగించే వ్యాధి.
దీనిలో ముఖ్యంగా రెం డు రకాలు ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్, ఇది కీళ్ల కండరాలు దెబ్బతినడం వల్ల వస్తుంది మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపా టుగా కీళ్లను దాడి చేసే ఆటోఇమ్యూన్ వ్యాధి.తొలిదశలో గుర్తించి సరైన చికి త్స తీసుకుంటే కీళ్ల దెబ్బతినడం నివారించవచ్చు.
కీళ్ల నొప్పు లు, వాపు, ఉదయం గట్టిపడడం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి,తగిన బరువును కాపాడు కోవడం, ప్రతిరోజూ తేలికపాటి వ్యాయా మం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, స్వచ్ఛందంగా మందులు వాడకపోవ డం వంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది అని మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్ డా. మహ్మద్ ఇర్ఫాన్ తెలిపారు. ఆధునిక వైద్యపద్ధతులు కీళ్ల పునరు ద్ధరణ శస్త్రచికిత్సలు ద్వారా ఆర్థరైటిస్ రోగులు కూ డా సుఖమైన జీవితం గడపవచ్చు. తొలిదశలో గుర్తింపు, అవగాహన వల్ల జీవన నాణ్య త కాపాడడానికి అత్యంత కీలకమన్నారు.