13-10-2025 12:27:12 AM
కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ అధ్యక్షుడు జిలకర రవికుమార్
ముషీరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ (టీపీఆర్‌పీ)లోకి రిటైర్డ్ ఐఐఎస్ ఆఫీసర్ కూనపరెడ్డి హరిప్రసాద్ ను ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాలలో సేవలందించిన ప్రసాద్ అవినీ తిరహిత పాలన కోసం రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం అన్నారు.
టిపిఆర్ పి విధి విధానాలు నచ్చి పార్టీలో చేరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో కొత్త రాజకీయ నాయకులు రావాలనే నినాదంతో టిపిఆర్ పి ద్వారా రెండు రాష్ట్రాలకు నాయకులను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. పాత రాజకీయ నాయకులు పోయి, కొత్త రాజకీయ నాయకులు రావాలని ఆకాంక్షతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా హరి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రాన్ని బిజెపికి, రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చిన ప్రజలు స్థానిక సంస్థలు, జెడ్పిటిసి, ఎంపీటీసీ, గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ కూడా కైవసం చేసుకొని పరిపాలన ఏ విధంగా ఉండాలనేది రాష్ట్రానికి చూపించే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి శ్యామ్ రావు, పావిళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.