17-10-2025 10:30:07 PM
117 బైక్ లు 07 ఆటోలు వాహనాలు స్వాధీనం
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ కాలనీ లో శుక్రవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పలు అంశాలపై తనిఖీలు కొనసాగించి పాత నేరస్థులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని ఆరాతీశారు. సరైన ధృవపత్రాలు లేని 124 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 117 బైకులు, 07ఆటోలు ఉన్నాయి. పోలీస్ అధికారులు స్థానిక ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వ్యక్తులపై సమాచారం అందించాలని ప్రజలను కోరారు.