17-10-2025 10:27:34 PM
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే సత్యనారాయణ
బెజ్జంకి: పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ బెజ్జంకి మండలానికి ఇప్పటి వరకు 20 విడుతల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామన్నారు. 20వ విడుతలో 39 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10,60,500 రూపాయలు మంజూరు కాగా, వాటిని ఇప్పుడు లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. 20వ విడుత చెక్కులను కలుపుకొని మండలానికి ఇప్పటి వరకు 754 మందికి 2,02,85,400 రూపాయలు మంజూరైనట్టు ఆయన తెలిపారు. వైద్య పరంగా పేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు.