calender_icon.png 18 October, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న జువ్వాడి నర్సింగరావు

17-10-2025 10:32:27 PM

కోరుట్ల రూరల్,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ నర్సింగరావు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం  జిల్లా మంత్రి అల్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డితో కలిసి డిసిసి పదవికి దరఖాస్తు చేసుకున్నారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ జిల్లాల్లో జరుగుతున్న జిల్లా నూతన కమిటీ లా అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా నర్సింగరావు దరఖాస్తు చేసారు. దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వాలని కోరుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు మాజీ పార్లమెంటు సభ్యులు జగిత్యాల జిల్లా ఇంచార్జ్ డాక్టర్ జై కుమార్ కు దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ తనకు డిసిసి అధ్యక్ష పదవి ఇస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.