calender_icon.png 20 October, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

20-10-2025 12:00:00 AM

నాగర్ కర్నూల్, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : మొక్కజొన్న కొనుగో లు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జి ల్లా కమిటీ డిమాండ్ చేసింది. నాగర్ కర్నూల్లో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రైవేట్ వ్యాపారస్తులు క్వింటాల్కు రూ.18002000కే కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆక్షేపించారు.

మద్దతు ధర రూ.2400 ఇవ్వాలని, మార్క్ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. పత్తికి సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.10,075 మద్దతు ధరతో పాటు రూ.475 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్ తప్పనిసరి షరతును ఎత్తివేసి రైతుల ఖాతాల్లో 24 గంటల్లో డబ్బులు జమ చేయాలని విజ్ఞప్తిచేశారు.