calender_icon.png 20 October, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత డబ్బుతో గ్రామ రోడ్డుకు మరమ్మతులు

20-10-2025 12:00:00 AM

కల్వకుర్తి అక్టోబర్ 19 : అధిక వర్షాలతో రోడ్డు కోతకు గురై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు సమీప గ్రామస్తులు సొంత డబ్బులతో మట్టి పోయించి మరమత్తులు చేపట్టారు. కల్వకుర్తి మండలం మార్చాల గ్రామం నుండి జీడిపల్లి వరకు బిటి రోడ్డు గుంతల మయంగా మారింది. వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి.

దీంతో వెంకటాపూర్ గ్రామానికి చెందిన బండెల రాంచంద్రారెడ్డి,కురుమిద్ద పి.కృష్ణారెడ్డి మరి కొంతమంది సహకారంతో ట్రాక్టర్లతో మొరం పోసి డోజర్లతో చదును చేయించారు. రోడ్డు బాగు చేయడం వలన వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రమాదాలు జరగకుండా కొంత మేలు జరుగుతుందని వాహనదారులు హర్షంవ్యక్తంచేశారు.