calender_icon.png 20 October, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ తరహాలో సర్కారు బడులు

18-10-2025 01:42:00 AM

  1. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు కొత్త స్కూళ్లు ఏర్పాటు
  2. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  3. విద్యాశాఖపై అధికారులతో సీఎం సమీక్ష   

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నర్సరీ నుంచి 4వ తరగతి వరకు కొత్త స్కూళ్లను ఏర్పాటు చేసి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతా ధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా స్కూళ్లలో కార్పొరేట్ స్కూల్ స్థాయి లో అన్ని వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకో వాలన్నారు. విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు ఆదేశాలు జారీ చేశా రు. నూతన స్కూళ్లలోని విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. 2026 జూన్‌లో అకడమిక్ ఈ యర్ నుంచి ఇది అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్లాలని ఆదేశించారు. పేదలకు మెరుగైన విద్య అం దించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభు త్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టి సారించాలన్నారు.

ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిది ద్దాలని, అన్ని వసతులు పాఠ శాలల్లో ఉండాలని సూచించారు. సరైన సౌకర్యాలులేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

సమీక్షా సమా వేశంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం స్పెష ల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యా, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, అధికారులు గణపతి రెడ్డి పాల్గొన్నారు.