16-12-2024 04:10:05 PM
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మాతృభూమి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ను సోమవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతూ, నివాసాలు, కార్యాలయాలు, ఇతర వాణిజ్య అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. నల్లగండ్ల ప్రాంతంలో మాతృభూమి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభం కావడం స్థానికులకు మరింత ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షులు జలేందర్ రెడ్డి, నల్లగండ్ల హుడా కాలనీ ఉపాధ్యక్షులు రంజిత్ పూరి, సంయుక్త కార్యదర్శి కృష్ణ మూర్తి, కోశాధికారి దొర బాబు, సీనియర్ నాయకులు శేఖర్, నర్సింగ్, రంగస్వామి, రాజు, మాతృభూమి రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, కాలనీ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.