calender_icon.png 7 November, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

07-11-2025 01:28:22 AM

-ఆసిఫాబాద్ జిల్లాలో రూ.75 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఎం నర్సింగరావు 

-రూ.10 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ మరిపెడ మున్సిపల్ ఏఈవో సందీప్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): రైస్‌మిల్ యజమాని వద్ద ఆసిఫాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎం నర్సింగరావు రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రైస్‌మిల్లు నుంచి సీఎంఆర్ బియ్యంను నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి, ధ్రువీకరణ పత్రా లు ఇచ్చేందుకు ఒక్కో లారీకి రూ.25 వేలు లంచం ఇవ్వాలని డీఎం నర్సింగరావు డి మాండ్ చేశాడు. దానికి అంగీకరించిన బాధితుడు ఆ తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు.

ఏసీబీ సూచన మేరకు గురువారం సాయం త్రం రెబ్బెన మండలంలోని కైరుగాం వద్ద బాధితుడు మూడు లారీలకు సంబంధించిన రూ.75 వేలు నర్సింగరావుకు ఇస్తుండ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నర్సింగరావుతోపాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మణికంఠను అదుపులోకి తీసుకొని కార్యాల యంలో అదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు విచారించారు. 

మరిపెడలో 

మరిపెడ(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో గురు వారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నీల్కుర్తి క్లస్టర్ ఏఈ వో సందీప్ రూ.10 వేలు లంచం తీసుకుం టూ పట్టుబడ్డాడు. ఆనేపురం గ్రామానికి చెందిన రైతు గత నెలలో చనిపోగా.. ఆయన పేరున రైతుబీమా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తును నమోదు చేసేందుకు ఏఈవో సందీప్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. మొదటగా రూ.పదివేలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న బాధితులు.. ఆ తర్వాత ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచ న మేరకు గురువారం బస్టాండ్ సమీపంలోని జేజే రెస్టారెంట్ ఎదురుగా ఏఈఓ సందీప్‌కు బాధితుడు రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాం బయ్య తెలిపారు.