calender_icon.png 7 November, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తిలో రసం పీల్చే పురుగుల

07-11-2025 01:27:41 AM

నివారణపై రైతులకు శిక్షణ 

ధర్మపురి,నవంబర్6 (విజయక్రాంతి): తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో వెల్గటూరు మండలం శాఖాపూర్ గ్రామంలో గురువారం పత్తిలో రసం పీల్చే పురు గులపై సమగ్ర సస్యరక్షణ చర్యలు‘ మీద రైతు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సస్యరక్షణ శాస్త్రవేత్త డా.యం. రాజేంద్రప్రసాద్ వాతావరణ సంబంధిత అంశాలను, చీడ పీడల యాజమాన్యంపై రైతులకు వివరించారు.

ముఖ్యంగా పత్తిలో పేనుబంక, తామర పురుగులు తెల్ల దోమ, పిండి నల్లి, గులాబి రంగు పురుగు లక్షణాలు మరియు నివారణ చర్యలు తెలియజేశారు. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడా క్లోప్రిడ్ 0.3మి.లీకు లీటర్ నీటిని లేదా ఎసిటామిప్రిడ్ 0.4 గ్రా.లీ కు లీటర్ నీటిని లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రా.లీ కు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలనీ సూచించారు. జిగురు అట్టలను 20 నుండి 25 వరకు ఎకరానికి పెట్టుకోవాలన్నారు.

ఆకు మచ్చ తెగుళ్ళ నివారణకు ప్రొపికోనజల్ 1మి. లి కు లీటర్ నీటికీ కలుపుకొని పిచికారి చేసుకోవాలన్నారు. కాయకుళ్ళు తెగులు నివారణకు కాపరాక్సి క్లోరైడ్ 3గ్రా.లీ. కు నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలన్నారు. తదనంతరం తెలంగాణ రైతు విజ్ఞాన కోఆర్డినేటర్ డా. హరికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ పత్తిలో కలుపు యాజమాన్యం పై, పోషక లోపాలపై రైతులకు అవగాహన కల్పించారు.

డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ ధరలకు అనుకూలంగా పంటలను సాగు చేయాలని రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీ. పి. సాయికిరణ్, వ్యవసాయ విస్తరణ అధికారినీ మౌనిక, రైతు సోదరులు పాల్గొన్నారు.