28-09-2025 01:17:39 AM
- రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
-మంచిర్యాల జిల్లాలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టెక్నికల్ అసిస్టెంట్
మేడ్చల్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రెండు వేర్వేరు ప్రాంతాల్లో శని వారం ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ టి రాధాకృష్ణారెడ్డి రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సోమారం గ్రామం వద్ద మూడేళ్ల క్రితం లేఔట్ చేసిన గంగస్థాన్ వెంచర్ యజమానులను డబ్బులు డి మాండ్ చేశారు.
గంగస్థాన్ వెంచర్‌కు హెచ్‌ఎండిఏ అనుమతి తీసుకున్నారు. పక్కన ఉన్న భూ యజమానులకు రాకపోకలకు వీలుగా రోడ్డు ఉండాలని ని బంధన ఉంది. కానీ వీరు రోడ్ల వద్ద గేట్లు ఏర్పాటు చేశారు. దీనిని ఆసరా చేసుకొని గేట్లు తొలగిస్తానని బెదిరించాడు. లేదంటే తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో యజమానులు వారం రోజుల క్రితం లక్ష ముట్ట చెప్పారు. రూ.3.50 లక్షలు శనివారం ఇవ్వడానికి బాధితులు ఫోన్ చేయగా కొంపల్లిలోని రాయిచందని మాల్ వెనుకకు రావాలని రాధాకృష్ణారెడ్డి సూచించాడు. బాధితుడు అక్కడికి వెళ్లగా డబ్బులు బ్యాగును కారు డాష్ బోర్డులో పెడుతుండగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు.
మంచిర్యాల జిల్లాలో
కన్నెపల్లి (భీమిని): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెంది న గోమాస కిష్టయ్య ఈజీఎస్ కింద పశువుల పాకను నిర్మించుకున్నా డు. బిల్లు చెల్లించాలంటే ఎంబీ రికార్డ్ చేయడానికి ఎంపీడీఓ కార్యాలయంలోని ఈజీఎస్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బానోత్ దుర్గాప్రసాద్ రూ.పది వేలు డిమాం డ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వారి సూచన మేరకు దుర్గాప్రసాద్‌కు రూ.పది వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.