28-09-2025 01:20:10 AM
---అంగన్‌వాడీ, ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి
---బతుకమ్మ.. మహిళల పండుగ
---రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, సెప్టెంబరు27(విజయక్రాంతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీ,ఆశా వర్కర్ల సమస్యలను విడతలవారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని,బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో గొప్పదని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు మంత్రి యూనిఫామ్ పంపిణీ చేశారు.
అంతకు ముందు గిరిజన భవన్‌లో ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదా రులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్‌వాడీ పాఠశాలలను మూసివేసే అవకాశం ఉందన్న ప్రచా రంలో నిజం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అదనంగా పాఠశాలలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని వివరించారు.
నూతన పాఠశాలలను ఏర్పాటు చేయడమే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టడానికి సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారని మంత్రి తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బంది తమ స్వంత పిల్లలు లాగానే చూసుకోవాలని, ఏకరూప దుస్తులు అందని సిబ్బందికి త్వరలో అందజేస్తామన్నారు. సోలార్ ప్లాంట్లు, ఆటోలు, వాహనాలు, బస్సుల కొనుగోలు కో సం వడ్డీలేని రుణాలను అందజేస్తు న్నామని తెలిపా రు. ప్రతి మహిళా సంఘంలో చేరి ప్రభుత్వం అందించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. మహిళా సంఘం అంటే భరోసా అని, తోటి సభ్యులు కష్టసుఖాల్లో తోడుంటారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రభుత్వానికి అండగా నిలవాలని సీతక్క కోరారు.