calender_icon.png 23 October, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారుల చేతిలో దగా పడుతున్న పత్తి రైతు

23-10-2025 01:50:14 AM

- సీసీఐ కొనుగోలు చేయక అవస్థలు 

- నిర్లక్ష్యం ధోరణిలో అధికారులు 

- ఎడ తెరపిలేని వర్షాలతో తీవ్ర నష్టాలు

- అధిక కూలి రేట్లతో ఇబ్బందులు

పదర అక్టోబర్ 22 : పండించిన పత్తి పంటను అమ్ముకుందామన్నా ప్రభుత్వం సిసిఐ కొనుగోలు ప్రారంభించక దళారుల చేతిలో పత్తి రైతులు నష్టపోతున్నారు. ఖరీఫ్ ఫండ్ టాప్ మొదటి నుంచి సరైన వర్షాలు లేక వేసిన విత్తనాలు భూమిలోనే కుళ్ళిపోయాయి. మరోసారి నాటుకోగా వరుస వర్షాలతో పత్తి పంట తెగుళ్ల బారిన పడింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా పత్తి పంటను సాగు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత కూడా రైతులపై పడింది. చివరికి పంట చేతికి వచ్చిన కూలీల కొరత కారణంగా రైతులు అప్పుల ఊబిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒక కేజీ పత్తి తీయడానికి రూ20ల నుంచి రూ 25 వేల కూలి అడుగుతున్నారు. ఏదో విధంగా పత్తిని ఇంటికి తెచ్చి అమ్ముకుందామన్న ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక ఆలస్యం చేయడంతో రైతులు కష్టాలలో కూరుకు పోతున్నారు. ఈసారి మరీ కొత్తగా పంట నమోదు చేసుకోవాలంటూ అధికారులు గొర్రెలు పెడుతుండడంతో రైతులు తికమక పడుతున్నారు. ఈ క్రమంలో బయట తెచ్చిన పెట్టుబడి అప్పులు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, యజమానులకు డబ్బులు చెల్లించాలంటేనే దళారులకు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు అమ్ముకుంటున్నా. 

ఈ ఏడాది సీజన్ ప్రారంభమై సుమారు నెల రోజులు గడిచిన ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో నెల రోజులుగా దళారులకు తక్కువ ధరలకే రైతుల నుంచి పత్తిని సేకరిస్తున్నట్లు ఆవేదన చెందుతున్నారు. కనీసం రూ.8 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా ప్రస్తు తం దళారులు రూ.6 వేల లోపే కొనుగోలు చేస్తున్నారు. వర్షాల కారణంగా పత్తి బాగా లేదంటూ కొందరు వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక ఎకరాకు రూ..40 వేల నుంచి రూ.. 50 వేలకు పైగా ఖర్చు అవుతుండగా అధిక వర్షాలు తెగుళ్ల కారణంగా ఒక ఎకరా దిగుబడి 10 క్వింటాల నుంచి 5 క్వింటాలకు పడిపోయింది. త్వరగా ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఫోన్ లో దరఖాస్తు చేయడం తెలియదు.

సీసీఐ కొనుగో లు కేంద్రంలో పత్తి అమ్ముకోవాలంటే ఫోన్లో దరఖాస్తు చేయడం మాకు తెలియదు. గత ఏడాది లాగే అమలు చేస్తే బాగుంటది. సీసీఐ కేంద్రాలు త్వరగా ప్రారంభించాలి. ఇళ్ల వద్ద పత్తి వర్షాలకు తడుస్తున్నది ఈ సంవత్సరం వర్షాలకు, తెగుళ్లు , అధిక కూలి రేట్ల వల్ల నష్టపోయాం దళారులు క్వింటా రూ.6 వేల లోపే అడుగుతున్నారు. 

ముడిగా శంకర్ రైతు, పదర.  

సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించాలి 

సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించలేదు. దీంతో కొందరు రైతులు ఇళ్లల్లో పత్తిని నిలు వ ఉంచుకోలేక దళారులకు విక్రయిస్తున్నారు. వారు క్వింటా రూ.6 వేలకే కొంటున్నారు. వ ర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలి. 

రైతుబక్కన్న,పదర