25-11-2025 12:55:47 AM
విత్తన చట్టం ముసాయిదాపై అభ్యంతరాలు ఉన్నాయి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వినతి
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొం టున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను జిష్ణుదేవ్ వర్మను రాష్ట్ర రైతు కమిషన్ బృందం వినతిపత్రం అందజేసింది. రాష్ర్టంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (సీసీఐ ) పత్తి కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తెరవడం, పత్తిని అమ్ముకోవాలంటే కేంద్రం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్‌కు వివరించింది.
రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్‌రెడ్డి, రాములు నాయక్, భవానీ రెడ్డి, భూమి సునీల్ భేటీ అయి పత్తి రైతుల సమస్యలను వివరించారు. ఎకరాకు 7 క్విం టాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనతో తలనొప్పిగా మారిందన్నారు. ఈసారి రాష్ర్టంలో 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, అధిక వర్షాలు, మొంథా తుఫాన్ వల్ల పత్తి రైతులు తీవ్ర నష్టపోయారని తెలిపారు.
రాష్ర్ట వ్యాప్తంగా రైతుల నుంచికమిష న్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను గవర్నర్‌కు వివరించారు. కేంద్రం విడుదల చేసిన విత్తన చట్టం ముసాయిదా-2025 పై అభ్యంతరాలు ఉన్నాయన్నారు. పత్తి రైతుల విషయంలో కమిషన్ ఇచ్చిన వినతిపత్రానికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు. సీసీఐ విషయంలో కేంద్రంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఇక విత్తనచట్టం ముసా యిదా విషయంలో వివరాలతో మరోసారి కలవాలని గవర్నర్ కోరినట్లు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.