calender_icon.png 25 November, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థిక ఉన్నతితో రాష్ట్ర ప్రగతి సాధ్యం

25-11-2025 12:53:02 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 

కామారెడ్డి, నవంబర్ 24 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక ఉన్నతితో రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.సోమవారం కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి  కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీ  మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు.మహిళ శక్తి తెలంగాణ శక్తి అభివృద్ధి యాత్రలో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ ఐరేని నర్సయ్య, నర్సారెడ్డి, రమేష్, లింబాద్రి, డిఆర్డిఏ అధికారులు, ఎస్ హెచ్ జి సభ్యులు పాల్గొన్నారు.

నందివాడలో..

తాడ్వాయి, నవంబర్, 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో సోమవారం మహిళా ప్రతినిధులు లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ చీరలతో సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. మహిళా సంఘం నాయ కులు, కాంగ్రెస్  ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ ..

నిజామాబాద్, నవంబర్ 24 (విజయ క్రాంతి): ‘మహిళా ఉన్నతి - తెలంగాణ ప్రగతి‘ కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐ.కే.పీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా, సజావుగా జరగాలని అన్నారు.  లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవ ప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చీరను అందించాలని సూచించారు.  పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు

కామారెడ్డి, నవంబర్ 24 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్  రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా.. సభలో  ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రస్తావించారు.

ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్, ఇందిరమ్మ హౌసింగ్, మహిళా శక్తి బృందాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయ సంఘాల కోసం పెట్రోల్ బంక్ స్థాపనకు అవసరమైన భూమిని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే గుర్తించినట్టు ఎమ్మెల్యే  తెలిపారు. గ్రామ మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు. కొండాపూర్ గ్రామంలో ఇందిరా క్రాంతి మహిళా సంఘాల కార్యకలాపాల కోసం ప్రత్యేక భవన నిర్మాణాన్ని త్వరలో చేపడతామని ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.