calender_icon.png 25 November, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెపోరులో ఎవరికివారే!

25-11-2025 12:00:00 AM

-సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం

-50శాతం మించకుండా రిజర్వేషన్లు

-పంచాయతీలు, వార్డుల కేటాయింపు

-526 పంచాయతీలు, 4,668 వార్డులు

-ప్రత్యేక వ్యూహాలతో రాజకీయ పార్టీలు 

రంగారెడ్డి, నవంబర్ 24 (విజయక్రాంతి):  పల్లెల్లో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఎవరు బరిలో నిలబడుతున్నారు.. ఎవరికి సపోర్టు చేయాలన్న చర్చ ఊపందుకున్నది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రకటన వెలువడింది. అయితే రాజకీయ పార్టీలు మాత్రం గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలాఉండగా, రిజర్వేషన్ల ప్రకారం ప్రత్యర్థులకు దీటుగా అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బాధ్యతలను నియోజకవర్గ ఇన్ చార్జీలు, నేతలకు ఎమ్మెల్యేలు అప్పగించారు. పంచాయతీ ఎన్నికలపై అధికారులు మరోసారి కసరత్తులు ప్రారంభించారు.

గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే .. ఎన్నికల ప్రక్రియ పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించి ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకటించింది. దీంతో రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించిందని కొందరు కోర్టును ఆశ్రయించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు మించకూడదని నిబంధన ఉండటంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ కోర్టు ఆదేశంతో నిలిచిపోయాయి. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటే 50శాతం రిజర్వేషన్లు మించొద్దని ప్రకటన చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం  మళ్లీ ఎస్సీ, ఎస్టీ,బీసీ, జనరల్ కులాల వారీగా ప్రభుత్వ నియమ నిబంధనలో అనుసరించి రిజర్వేషన్లను కేటాయించింది.

సర్పంచు స్థానాలకు ఆర్డీవోలు, వార్డు స్థానాలకు ఎంపీడీఓ ల పర్యవేక్షణలో అన్ని స్థానాల్లో మహిళలకు 50 శాతం  రిజర్వేషన్లు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు పంచాయతీ వార్డు స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో 21 మండలాల్లో  మొత్తం 526 పంచాయతీలు, 4,668 వార్డు స్థానాలకు రిజర్వేషన్ల కేటాయిస్తూ డ్రాఫ్ట్  నోటిఫికేషన్ విడుదల చేశారు.

ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి..

ఎన్నికల నోటిఫికేషన్ నేడో, రేపు వెలువడనున్నట్లు  సమాచారం. అధికార పార్టీ నేతలు మెజార్టీ స్థానాలను సర్పంచులు, వార్డు స్థానాలనుగ్రామాలు,వార్డు స్థానాలకు  పార్టీ నేతలు సిద్ధం కావాలని ఇప్పటికే ఇన్చార్జి మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు  పార్టీ నేతలకు గెలుపు పై దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నేతలను 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం కొంత ఇరుక్కున్న పెట్టే అవకాశం ఉంది.

గతంలో తమ ఊరికి కేటాయించిన రిజర్వేషన్లు మార్పులు జరగడంతో పలువురు ఆశావాల్లో సైతం తీవ్ర నైరాశం నెలకొంది. ప్రతిపక్ష పార్టీల నేతలు బీఆర్‌ఎస్, బీజేపీలో సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తాచాటాలని, అధికారపార్టీ అభ్యర్థులకు దీటుగా తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలని ఎత్తుగడలు వేస్తుంది. గెలుచుకునేందుకు ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు.

జిల్లాలో మొత్తం స్థానాలు 526 

ఎస్టీ - జనరల్( 49)- 42( మహిళ )

ఎస్సీ  జనరల్ (55)  51(మహిళ )

బీసీ    జనరల్ (50)   42(మహిళ)

జనరల్         (125)  112(మహిళ)

వార్డు స్థానాలు 4,668

వంద శాతం ఎస్టీల కేటాయింపు

జనరల్  (238)  238( మహిళ ) (476)

జనరల్ 106     153(మహిళ)

ఎస్సీ (378)        522(మహిళ )

బీసీ (379)          549( మహిళ)

జనరల్ (983)     1122(మహిళ)