25-11-2025 12:00:00 AM
బుర్ర మధుసూదన్ రెడ్డి :
సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలం లో సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవరినీ వదలడం లేదు. అందరి ఫోన్లనూ హ్యాక్ చేస్తున్నారు. ఇటీవలే ప్రజల్లో అవగాహన పెరగడంతో, ఓటీపీలు చెప్పకుండా జాగ్రత్త పడుతుండడంతో ఇప్పుడు నేరగాళ్లు నేరుగా మొబైల్ ఫోన్లనే హ్యాక్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఏపీకే ఫైల్స్ పేరుతో అలజడి సృష్టిస్తున్నారు.
‘ఆధార్‌తో పాటు ఇతర నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలు అప్‌డేట్ చేసుకోని కారణంగా బ్యాంకు ఖాతా లను బ్లాక్ చేస్తున్నాం. వెంటనే కింద ఉన్న లింకును క్లిక్ చేసి వివరాలు అప్‌లోడ్ చేయండి’ అని టీమ్ ఎస్‌బీఐ పేరుతో అనే క వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు వచ్చా యి. ఎస్‌బీఐ అకౌంట్లు ఉన్న ఖాతాదారులు భయంతో ఏపీకే ఫైల్స్ లింక్ ఓపెన్ చేయడంతో వారి ఖాతాలు సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. ఆ తర్వాత అకౌంట్ల నుంచి పెద్ద ఎత్తున నగదును దో చుకుంటున్నారు.
ఇటీవలే సైబర్ మోసగాళ్లు కనుగొన్న మరొక నయా ఘరానా చోరీ ‘డిజిటల్ అరెస్ట్’. నేడు డిజిటల్ అరె స్ట్ అనేది సైబర్ నేరగాళ్ల నూతన ఆయుధమని, దీనిపట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, పూర్తి అవగాహన కలిగి ఉండి వారి మాయమాటలకు బెదరకుండా తగు సమాధానం ఇవ్వాలని పోలీసు అధికారులు/సైబర్ క్రైమ్ విభాగాలు కోరుతున్నా యి. డిజిటల్ అరెస్ట్ అనే అంశాన్ని దేశ ప్రధాని సైతం తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించడం చూస్తే దీని తీవ్రత ఎంతలా ఉందనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.
ఆన్‌లైన్ మోసాలు..
డిజిటల్ అరెస్టు పేరుతో తాము పోలీసులమని చెప్పి.. ఆధార్ కార్డు నెంబర్ స హా అన్ని వ్యక్తిగత వివరాలను ఆరా తీయ డం జరుగుతుంది. విదేశాల్లో చదువుకునే మన వాళ్లకు ఆహార పదర్థాలు, ఇతర పరికరాలను పంపించడాన్ని ఆసరాగా చేసుకు నే సైబర్ నేరగాళ్లు .. కస్టమ్స్ అధికారుల్లా గా ఫోన్లు చేసి మాట్లాడడం చేస్తుంటారు. మీరు ఒక పార్సల్‌ని ఆస్ట్రేలియాకు ఇటీవ లే బుక్ చేశారని, అందులో ప్రమాదకర మాదక ద్రవ్యాలు, కొన్ని ఫేక్ పాస్‌పోర్టులు ఉన్నాయంటారు.
మీరు పంపించిన మాదకద్రవ్యాలు, ఫేక్ పాస్ పోర్టుల కేసు ను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారని, వెం టనే మిమ్మల్ని అరెస్టు చేసి ఎన్‌ఫోర్స్‌మెం ట్ విభాగం కేసు నమోదు చేయడం, కనీ సం ఏడాది పాటు జైలులో ఉంచి దర్యాప్తు చేస్తామంటారు. వెంటనే స్కుప్ యాప్ డౌన్ లోడ్ చేసుకొమ్మని, వీడియో కాల్ ద్వారా ఢిల్లీ పోలీసు యూనిఫాం ధరించిన వ్యక్తి నేరారోపణలు చేయడం, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామంటూ భ యాందోళనలకు గురి చేస్తారు.
కానీ నిజమైన అధికారులెవరు ఇలా ఫోన్ చేసి బెదిరించడం జరగదు అన్న విషయాన్ని తెలు సుకోవాలి. అయితే సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత వివరాలు సేకరించి లక్షలు, కోట్ల ల్లో నగదును ఆన్‌లైన్ మోసాలతో బదిలీ చేయించుకోవడం నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది.
కోట్లు కాజేస్తున్న వైనం..
ముంబైకి చెందిన ఒక ట్యూషన్ మాస్టారును 22 గంటల పాటు ‘డిజిటల్ అరెస్టు’ చేసి తన ఖాతా నుంచి రూ. 51. 27 లక్షలు బదిలీ చేయించుకోవడం, హైదరాబాద్‌కు చెందిన ఒక రిటైర్డ్ లెక్చరర్‌ను డిజిటల్ అరెస్టు చేసి రూ. 45 లక్షలు, పుణేకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉన్నతాధికారిని బెదిరించి ఏకంగా 6.29 కోట్లు, ల క్నోకు చెందిన డాక్టరు నుంచి రూ. 2.8 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకోవడం లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
సైబర్ నేరగాళ్లు మనల్ని ఇంట్లోనే వీడియో కాల్‌లో బంధించి, పోలీసులమని, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులమని, యూనిఫాం ధరించి నేరుగా బెదిరించి, వీడియో కాల్ ముందే నిలబెట్టి మన నుంచి పెద్ద మొ త్తంలో డ బ్బులు దోచేయడాన్నే డిజిటల్ అరెస్ట్‌గా పేర్కొంటున్నారు. వైజ్ఞానిక, సాం కేతికత కొత్త పుంతలు తొక్కుతుండడం, డిజిటల్ యుగానికి ఏఐ తోడవ్వడం, సైబ ర్ నేరగాళ్లు కూడా తమ అతి తెలివిని ప్రదర్శించి నయా మోసాలకు పూనుకోవడం తో అమాయక ప్రజలు భారీగా నష్టపోతున్నారు.
డిజిటల్ అరెస్ట్ అనే పదమే మన న్యాయ వ్యవస్థలో లేదని, అలాంటి అరెస్టు లు జరగవని, కేసు తీవ్రతను బట్టి అవసర మైతే నేరుగా పోలీసులు ఇంటికి వచ్చి అ రెస్టు చేస్తారని ప్రజలు గమనించాలి. సై బర్ నేరగాళ్లు పలు విధాలుగా మన వ్యక్తిగత వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారని గమనించాలి. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఈపూ వాట్సాప్ కాల్స్ చేసి మన వ్యక్తిగత వివరాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.
పరిష్కార మార్గాలు..
సైబర్ నేరగాళ్ల మోసాలకు అవధులు ఉండడం లేదు. కొత్త కొత్త వ్యూహాలను వాడి అమాయక ప్రజలను బెదిరించి డ బ్బులు గుంజుతున్నారు. మనం వా డుకు నే స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, ట్యా బ్లెట్ పీసీ లాంటి ఉపకరణాలలో ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను వాడి ఫేక్ కాల్స్‌ను కట్టడి చే యాలి. మన వ్యక్తిగత పాస్‌వర్డ్‌ను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. ఆర్థిక లావాదే వీలు చేసినప్పుడు కనీసం రెండు భద్రతా వివరాలను (పాస్‌వర్డ్, ఓటీపీ, బయోమెట్రీ, భద్రతా ప్రశ్నలు లాంటివి) వాడు కోవాలి.
బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. ఒకవేళ వాడినా ప్రతిసారీ సైన్ ఇన్, సైన్ అవుట్ కావడం, బ్రౌజ్ చేసిన అంశాలను డిలీట్ చేయడం మరిచిపోవద్దు. తెలియని ఈ వచ్చిన ఎలాంటి డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసు కోవద్దు. ఆడియో, వీడియో కాల్స్ రూ పం లో బెదిరిస్తే తగిన సమాధానమిస్తూ, లో కల్ పోలీసులను సంప్రదించాలి. గుర్తు తెలియని వ్యక్తులు చేసే కాల్స్, ఆరోపణల ను కొట్టి పారేయండి.
ఒకవేళ మనకు తెలియకుండా నగదు బదిలీ జరిగితే వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ పోలీసు విభాగాలకు తెలియజేయండి. సైబర్ నేరగాళ్లు క్షణాల్లో వ్యక్తిని ఒత్తిడికి గురి చేసి, అత్యవసర కేసు అంటూ, ఇళ్లు దాటవద్దని, వీడి యో లేదా ఆడియో కాల్ రూపంలో ఆన్‌లైన్‌లో బెదిరించడాన్ని నకిలీ కాల్‌గా గుర్తించాలి.
పోలీ స్ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎవరు కాల్ చేసి వ్యక్తిగత వివరాలు అడగరని, అవసరమైతే మన ఇంటికే ప్రత్య క్షంగా వస్తారని గమనించి డిజిటల్ అరెస్ట్ విష వలలో పడొద్దని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగదు పోయిన తర్వాత తిరిగి పొందడం కష్టం. కాబట్టి సైబర్ నేరాలపై తస్మాత్ జాగ్రత్త!
వ్యాసకర్త సెల్: 9949700037