calender_icon.png 20 November, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతుల పరేషాన్!

20-11-2025 12:00:00 AM

- పెరిగిన పెట్టుబడి, తగ్గిన దిగుబడి 

- తేమ పేరుతో కొర్రీలు, తూకాలతో మోసాలు 

- దళారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు

- పాతాళానికి పడిపోతున్న ధరలు 

- గ్రామాలలో దందా షురూ చేసిన దళారులు

- తీవ్రంగా నష్టపోతున్న కర్షకులు

మణుగూరు, నవంబర్ 19 (విజయక్రాం తి) : ఒకప్పుడు తెల్లబంగారంగా విరాజి ల్లిన పత్తి నేడు రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. అతివృష్టి, అనావృష్టులతో దిగుబ డులు తగ్గటం, ప్రభుత్వం ప్రకటిస్తు న్న మద్దతు ధర రైతులకు ప్రయోజనకరం గా లేకపోవటం, బహిరంగ మార్కెట్లో దళారుల జోక్యం, సిండికేట్ వ్యాపారుల కుమ్మక్కు, పాలకుల విధానాలు ఇందుకు కారణంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితు ల మధ్య నేడు మార్కెట్లో లభిస్తున్న పత్తి ధరలు రైతాంగంలో తీవ్ర ఆందోళన కు గురి చేస్తున్నాయి.

సీజన్ ఆరంభం నుంచి అన్నదాతకు కాలం పరీక్ష పెడు తూనే ఉంది. జూన్, జులై నెల లో వర్షాలు రైతులతో దాగుడు మూతలాడటంతో పాటు, మోంధా తుఫాన్ తీరని నష్టా న్ని మిగిల్చింది. మరోవైపు మార్కెట్లు, జిన్నిం గ్ మిల్లులు, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి కొనుగోళ్ళ ను సోమవారం నుం చి బంద్ పెట్టారు. దీంతో పత్తిని అమ్ముకు నేందుకు వచ్చిన రైతులకు నిరాశ తప్ప డం లేదు. డబ్బులు అత్యవసరమైన రై తులు త క్కువ ధరకు దళారులకు పంట ను విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొం ది. పత్తి రైతుల కష్టాల పై విజయ క్రాంతి కథనం..

ఖర్చులు బారెడు, లాభాలు చారెడు&జిల్లాలో తెల్ల బంగారం సాగు చేసిన రై తులకు కష్టాలు తప్పట్లేదు. పెరిగిన విత్త నాలు, ఎరువుల ధరలతో పాటు సాగుకో సం ఒక్కో ఎకరానికి రూ. 40 నుంచి రూ. 50 వేల దాకా ఖర్చు చేశారు. కనీసం ఎక రానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తే, లాభా ల మాట ఎలా ఉన్నా కనీసం పెట్టుబడుల మందమైనా వచ్చే అవకాశముంటుందని రైతులు భావించారు. ఈ క్రమంలో పంట చేతికొచ్చే సమయంలో తుపాన్ ప్రభావం తో ఏకధాటిగా కురిసిన వర్షాలకు అనేక ఎకరాలలో ప త్తి పంట తీవ్రంగా దెబ్బతి న్నది. ఖమ్మం జిల్లాలో లక్షా 79వేల 287 ఎకరాలు, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో లక్షా 99వేల 720 ఎకరాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగైంది. వర్షాభావం, తెగుళ్లు, తుపాను వంటి సమస్యలతో దిగుబడు లు గణనీయంగా పడిపోయాయి. 

 తేమ పేరుతో ధర తగ్గింపు..

కేంద్ర ప్రభుత్వం 8 శాతం తేమ ఉన్న ఏ గ్రేట్ పత్తి క్వింటాలుకు రూ.7521 నిర్ణ యించింది. 9 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటే ఆ పత్తిలో తేమ శాతాన్ని బట్టి మద్దతు ధరను తగ్గించి కొనుగోలు చేస్తారు. జిల్లాలోని పలు జిన్నింగ్ మిల్లు ల్లో తేమ శాతం సాధారణ స్థాయిలో ఉ న్నప్పటికీ తేమ శాతం ఎక్కువ శాతం ఉందంటూ సాకు చూపిస్తూ పత్తి రైతు లను మోసం చేస్తున్నారనే ప్రచారం జరు గుతున్నది. మరోవైపు ధాన్యం మాదిరిగా పత్తి ఆరబెట్టుకునే పరిస్థితి ఉండదు.

మా ర్కెట్కు అమ్మకానికి తెస్తే అయితే సీసీ ఐకి లేదంటే ప్రైవేట్గా ఆమ్ముకొని ఇంటి కి పోవాల్సిందే. ఒకసారి ఇంటి నుంచి వాహనంలో తెచ్చిన పత్తిని మళ్లీ తీసు కోపోవాలంటే కిరాయి మీద పడి రవాణా ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. దీం తో తేమ పత్తి నల్లగా మారిందనే సాకుతో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.1000 నుంచి రూ.2 వేలు తగ్గించి కొనుగోలు చేస్తు రైతుల నడ్డివిరుస్తున్నారు.

సిండికేటైన వ్యాపారులు

ప్రభుత్వం డిమాండ్ ఉన్నచోట సకాలం లో సీసీఐ కేంద్రాలు ప్రారంభించకపోవడం దళారులకు కలిసి వచ్చింది. గ్రామాల్లో పలువురు ఫర్టిలైజర్ యజమానులు, వడ్డీ వ్యాపారులు, పత్తివ్యాపారుల అవతారం ఎత్తారు. ఏజెంట్లను నియమించుకుని తమ కు పరిచయం ఉన్న వారితో ఆయా ప్రాంతాలలో పత్తిని కొనుగోలు చేస్తున్నా రు. తమకు రవాణా ఖర్చులు తప్పడంతో పాటు అక్కడిక్కడే డబ్బులు చెల్లిస్తారనే ఉ ద్దేశంతో రైతు లు కూడా వారికే పత్తిని విక్రయించడానికి సుముఖత చూపుతు న్నా రు.

దీంతో దళారులు రైతులను మద్ద తు ధరలో రూ.2వేల వరకు ముంచుతు న్నారు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొట్లాది రూపాయలు నష్టపోయా రు. కాగా, పత్తిని తూకం వేసేటప్పుడు ఎలక్ట్రానిక్ కాంటాలను వినియోగిం చాల నే నిబంధన ఉన్నా, గ్రామాల్లో ఎక్కడా అవి కనిపించడం లేదు. అధికారుల నిర్ల క్ష్యం కారణంగా దళారులు పాతరకం కాం టాలను వినియోగిస్తున్నారు. పాత రకం బాట్లు వాడడంతో క్వింటాలుపై సుమారు 15 కిలోల పత్తిని అదనంగా తూకం వేస్తు న్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము మరింతగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సీసీఐ కోనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని,దళారుల దందాకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయా లని రైతులు కోరుతున్నారు.