calender_icon.png 20 November, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

79 ఏళ్ల వృద్ధుడికి అరుదైన చికిత్స

20-11-2025 12:00:00 AM

మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్‌లో ‘టావీ’ ప్రక్రియ ద్వారా పునర్జీవనం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్‌లో తీవ్రమైన ఏఓర్టిక్ వాల్వ్ వ్యాధి, తరచుగా శ్వాస తీసుకోవడంలో కలిగే ఇబ్బందితో బాధపడుతున్న 79 ఏళ్ల వృద్ధుడికి అత్యంత అధునాతన ట్రాన్స్క్యాథెటర్ ఏఓర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్  (టావీ) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ మినిమల్ ఇన్వేసివ్ విధానంలో చేసే గుండె చికిత్సను సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్ అజ్మేరా నేతృత్వంలోని బృందం నిర్వహించింది.

రోగి వయస్సు మరియు ప్రమాద కారకాలను పరిగణనలోకి తీసుకుని, డాక్టర్ ప్రకాష్ అజ్మేరా, ఓపెన్-హార్ట్ సర్జరీకి సురక్షితమైన మరియు అతి తక్కువ కోతతో కూడిన ప్రత్యామ్నాయమైన టావీ ప్రక్రియను సిఫార్సు చేశారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయగా. కేవలం మూడు రోజుల్లోనే రోగి స్థిరమైన ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. తనకు తిరిగి జీవితాన్ని అందించిన డాక్టర్ ప్రకాష్ అజ్మేరా, ఎంఆర్‌ఎన్‌హెచ్ బృందానికి వృద్ధుడు ధన్యవాదాలు తెలిపారు.

డాక్టర్ ప్రకాష్ అజ్మేరా మాట్లాడుతూ.. వృద్ధులకు, అధిక ప్రమాదం ఉన్న రోగులకు టావీ గుండె సంరక్షణను మార్చివేసింది. ఇది వేగవంతమైన కోలుకోవడం, తక్కువ అద్భుతమైన దీర్ఘకాలిక ఫలితాలను అందిస్తుంది అని చెప్పారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం వైస్-ఛైర్మన్ డా. ప్రీతిరెడి,్డ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘సకాలంలో జోక్యం, అధునాతన కార్డియాక్ సాంకేతికత యొక్క శక్తిని ఈ కేసు ప్రతిబింబిస్తుంది’ అన్నారు.