18-10-2025 12:47:45 AM
తాండూరు,(విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత అభియాన్ 5వ వార్షికోత్సవ వేడుక పెద్దముల్ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. మాదకద్రవ్యాల వినియోగం దుష్ప్రప్రభావాలు అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ లైన్, సఖి బృందం ప్రతినిధులు మాట్లాడుతూ మదకద్రవ్యాలు డ్రగ్స్ వినియోగం, రవాణా చేస్తున్నట్టు తెలిస్తే 1908 కి ఫోన్ చేయాలని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే ముఖ్యమైన చట్టాల వివరాలను తెలిపారు. అనంతరం వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్ లను అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత బృందం, సఖి బృందం, చైల్డ్ లైన్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, మరియు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.