17-11-2025 06:33:39 PM
కౌలు రైతులకు ఆధార్ కార్డు ప్రతిపాదికన పత్తిని కొనుగోలు చేయాలి..
బీసీ రైతు సంఘం అధ్యక్షుడు వైరాగడే మారుతి పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎకరా పట్టాకు ఎటువంటి షరతులు లేకుండా 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని కౌలు రైతులకు ఆధార్ కార్డ్ ప్రతిపదికన పత్తి కొనుగోలు చేయాలని బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వైరాగడే మారుతి పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కాపాస్ కిసాన్ యాప్ వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎకరాకి కేవలం ఏడు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే మిగతా పత్తిని ప్రైవేట్ దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారని కౌలు రైతులు పట్టా పాస్ పుస్తకాలు లేక కాపాస్ కిసాన్ యాప్ లో కౌలు రైతుల ఎంపిక లేక ప్రైవేట్ దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కలెక్టర్ చొరవ తీసుకొని పత్తి రైతుల సమస్యలను పరిష్కారమయ్యే దిశగా రైతుల పక్షాన ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు.