calender_icon.png 17 November, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ ఆధ్వర్యంలో రైల్వే లోకో పైలట్ ధర్నా

17-11-2025 06:23:23 PM

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..

బెల్లంపల్లి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం లోకో పైలట్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ ఛైర్మెన్ ఎస్ నాగరాజు ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ లో గల లోకో పైలట్స్ కృలాబీ కార్యాలయం ఎదుట సోమవారం లోకో పైలట్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా నాగరాజు మాట్లాడుతూ రైల్వే వ్యవస్థకు మూల కారణమైన లోకో పైలట్ షిఫ్ట్స్ నెలలో 4 కాకుండా రెండుకు తగ్గించాలని, 36 గంటల్లో పైలట్స్  హెడ్ క్వార్టర్స్ కువచ్చే విధంగా నిబంధనలు కేంద్ర ప్రభుత్వం అమలు పర్చాలని నాగరాజు డిమాండ్ చేశారు. కాని విధి నిర్వహణలోపైలట్స్ 70 గంటలు పనిచేయాల్సి వస్తుందని లోకో పైలట్స్ పై కేంద్ర ప్రభుత్వం అధిక పని భారం మోపుతుందని పేర్కొన్నారు.

బెల్లంపల్లి, బల్లార్షా రామగుండం, పండ్రపాణి రైల్వే గూడ్స్ డిపోల్లో గల రన్నింగ్ రూమ్స్ ను ఆధునీకరించి అభివృద్ధిపర్చాలని, వాటిలో మహిళా లోకో పైలట్లకు తగు సౌకర్యాలు కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోకో పైలట్స్ కు 25శాతం కిలోమీటర్ ఫర్ అలవెన్స్ చెల్లించాలని, 2024 జనవరి 1 నుంచి 120 కిలో మీటర్ల మైలేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే లోకో పైలట్లకు డిపోలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్ రావు,సీనియర్ నాయకుడు రవీందర్ లు ఇచ్చిన పిలుపులో భాగంగా బెల్లంపల్లి లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో లోకో పైలట్లు పాల్గొని విజయవంతం చేశారని ఆయన తెలిపారు. ఇన్కమ్ టాక్స్ లో కిలోమీటర్ ఫర్ అలవెన్స్ తొలగించాలని గూడ్స్ 42 గ్రేడ్ పే ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ జి .సాంబశివుడు, కోశాధికారి షోకేష్ మీనా, నాయకులు సీ హెచ్ హేమ, పీ. నికిత, ఎస్ షా, సాగర్ భట్, ధీరజ్ అగర్వాల్, వివేక్, రామ్ లఖన్ లాల్ మీనా, పెద్ద సంఖ్యలో లోకో పైలట్లు పాల్గొన్నారు.