31-10-2025 08:09:36 PM
 
							మల్కాజ్గిరి,(విజయక్రాంతి): మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ సంగిశెట్టి శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ శ్రీనివాస్ పరిశోధన, సాహిత్య రంగాలకు ఆదర్శం అన్నారు. సభాధ్యక్షుడు ప్రిన్సిపాల్ బండి రాజు సమాజంపై స్పందించే వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు.