calender_icon.png 3 September, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ మండపాలను సందర్శించిన సీపీ గౌస్ ఆలం

01-09-2025 12:59:11 AM

కరీంనగర్ క్రైం, ఆగస్ట్31(విజయక్రాంతి):కరీంనగర్ నగరంలోని చైతన్యపురి, రాంనగర్, గోదాము గడ్డ, మార్వాడి మందిర్, టవర్ సర్కిల్, గాంధీ రోడ్డు, నాఖా చౌరస్తా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సందర్శించారు. వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండప నిర్వాహకులతో మాట్లాడిన కమీషనర్, నిమజ్జనం కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు.

మండపాల వద్ద శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించా రు. నిమజ్జనం రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో టౌన్ ఏసిపి వెంకటస్వామి, ట్రాఫిక్ ఏసిపి యాదగిరి స్వామి, పట్టణ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, సృజన్ రెడ్డి, జాన్ రెడ్డి, రమేష్, విశ్వహిందూ పరిషత్ నుండి రాధాకృష్ణ రెడ్డి, రమేష్ లుపాల్గొన్నారు.