calender_icon.png 5 September, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులు లేక అందని విద్య

01-09-2025 12:59:53 AM

నియమించాలని విద్యార్థులు ఆందోళన 

 వెల్దండ ఆగస్టు 31: విద్యార్థులు ఉన్నా విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక చదువులు ముందుకు సాగడం లేదని ప్రధాన సబ్జెక్టులకే బోధన జరగకపోవడంతో విషయపరిజ్ఞానం ఎలా వస్తుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన ఎదుతున్నారు.

వెల్దండ మండల పరిధిలోని అజిలాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తరగతులకు సరిపడా ఉపాధ్యాయులు లేక పోవడంతో విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. అనేక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కంటే ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారని ఇక్కడ విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులను నియమించకపోవడం దారుణమని అన్నారు. మండల విద్యాధికారి చొరవ తీసుకొని అదనంగా ఉపాధ్యాయుల నియమించాలని గ్రామస్తులు విద్యార్థులు డిమాండ్‌చేస్తున్నారు.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తక్కువగా ఉన్న టీచర్ల సంఖ్యను భర్తీ చేసేందుకు భౌతిక శాస్త్రం, హిందీ, ఇంగ్లీష్ ముగ్గురు టీచర్లను సర్దుబాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి రవికుమార్ ను కోరినట్లు మండల విద్యాశాఖ అధికారి చంద్రుడు పేర్కొన్నారు. త్వరలోనే ముగ్గురు టీచర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సానుకూలంగా స్పందించినట్లుతెలిపారు.