19-11-2025 10:46:52 PM
జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని అలీరాజ్ పేట గ్రామంలో వరకట్న వేధింపులతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి. వివరాల్లోకి వెళితే గజ్వేల్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సదా ఫ్రీన్ 21 సంవత్సరాలు ఈ సంవత్సరం మే నెలలో అలీరాజ్ పెట్ గ్రామానికి చెందిన ఫరీద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన మూడు నెలల నుంచి ఇంట్లో వరకట్నం వేధింపులు జరిగాయి. వేధింపులు భరింపలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని అనుమానాస్పదంగా చనిపోయిందని జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. భర్త ఫరీద్, అత్త జారీనబి, మామ మహమ్మద్ కలిసి చంపరాని తండ్రి షాబుద్దీన్ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు ఎస్సై పేర్కొన్నారు.