16-07-2025 01:40:57 PM
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు(Telangana Activist), బహుజన మేధావి, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్(Professor Prabhanjan Yadav) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టు మేధావిగా, యాక్టివిస్ట్ గా ప్రభంజన్ యాదవ్ చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. ఢిల్లీలో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న ప్రభంజన్ యాదవ్ ఉద్యమ నిబద్ధత గొప్పదని కేసీఆర్ అన్నారు. మహాత్మా ఫూలే, అంబేద్కర్ సామాజిక తాత్విక ఆలోచనా దృక్పథంతో, బీసీ కులాల హక్కులు, పురోగతి కోసం నిత్యం తపించే ప్రభంజన్ యాదవ్ మరణంతో తెలంగాణ ఒక గొప్ప తాత్వికున్ని, సామాజిక ఉద్యమకారున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.